- Home
- Life
- Health
- Air Conditioner Effects: ఏసిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
Air Conditioner Effects: ఏసిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
Air Conditioner Effects: వేసవిలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా అందరి ఇళ్లల్లో, ఆఫీసులలో, కార్లలో ఏసీల వాడకం పెరిగిపోతోంది.

ఎయిర్ కండిషనర్ (Air conditioner) అనేది వాతావరణ పరిస్థితుల నుండి మనల్ని కొంత మేరకు మాత్రమే రక్షించగలదు. అయితే ఎక్కువ సేపు ఏసీ గదుల్లో ఉంటే ఆరోగ్యానికి ముప్పు (Threat to health) అని వైద్యులు అంటున్నారు. అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎండలకు తట్టుకోలేక చల్లగా ఉండేందుకు ఏసీని ఉపయోగిస్తుంటాం. అయితే ఏసీ విషయంలో కొన్ని జాగ్రత్తలు (Precautions) తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలకు (Illness problems) దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా పిల్లలు గదిలో ఉన్నప్పుడు ఏసీ వేయరాదు. ముందుగానే ఏసీని ఆన్ చేసి, వాతావరణం చల్లబడిన తరువాత పిల్లల్ని గదిలోకి తీసుకువెళ్లడం మంచిది.
గది ఉష్ణోగ్రత మరీ చల్లగా కాకుండా 20 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండేలా చూసుకోవాలి. చల్లదనం (Coldness) నేరుగా ముఖానికి తగలకుండా జాగ్రత్తపడాలి. ఎక్కువ సేపు ఏసీని వేసి ఉంచాల్సిన అవసరం లేదు. గది చల్లబడింది అనిపించాక ఆపేయాలి. ఏసీ వేశాక ఆ గది తలుపులు తెరవకుండా (Without opening the doors) ఉండాలి.
ఏసీ గాలికి చర్మం పొడిబారుతుంది. కనుక మాయిశ్చరైజర్ (Moisturizer) ను అప్లై చేసుకోవాలి. పసిపిల్లలు ఉన్న గదిలో ఏసీ వేస్తుంటే వారికి చేతులు, కాళ్లు కప్పే దుస్తులను వేయాలి. ఇవి చలి నుంచి వారిని కాపాడుతాయి. అలాగే పిల్లలకు టోపీ కూడా పెడితే మరీ మంచిది. ఏసీ గదుల్లో ఎక్కువగా గడుపుతున్న వారికి దాహం (Thirst) తక్కువగా వేస్తుంది.
ఇలా ఎక్కువసేపు ఏసీలో ఉన్నవారు నీళ్లు తక్కువగా తాగుతూ ఉండడంతో డీహైడ్రేషన్ (Dehydration) సమస్య ఏర్పడి కిడ్నీలో స్టోన్స్, చర్మంపై దురదలు, అలసట, తలనొప్పి (Headache) వంటి సమస్యలు ఏర్పడతాయి. కనుక దాహం లేకపోయినా కూడా మధ్యమధ్యలో మంచినీళ్లు, కొబ్బరినీళ్లు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఏసీ ఉపయోగం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
రెగ్యులర్గా ఏసీని సర్వీసింగ్ (Servicing) చేయించాలి. లేదంటే ఇందులో పేరుకుపోయిన దుమ్ము, ధూళి కారణంగా సూక్ష్మక్రిములు (Germs) శ్వాస తీసుకునే సమయంలో శరీరంలోకి ప్రవేశించి శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, అలర్జీలు వంటి అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇలా ఎండల నుంచి ఉపశమనం కోసం ఎక్కువసేపు ఏసీ గదుల్లో గడపడంతో కంటి సమస్యలు (Eye problems), గొంతు సంబంధిత సమస్యలు (Throat related problems) కూడా తలెత్తుతాయి. అలాగే ఎక్కువ సేపు ఏసీ గదిలో ఉండి ఒక్కసారిగా చల్లటి వాతావరణం నుండి వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్ళకూడదు.
ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. ఏసీ ఆటో ఆఫ్ లో ఉండి గది ఉష్ణోగ్రతను (Room temperature) సమానస్థాయిలో ఉంచేదిగా ఉండాలి. కనుక వీలైనంత వరకు ఏసీ వాడకాన్ని ఎక్కువ సమయం ఉపయోగించకుండా చూసుకోవాలి. అప్పుడే ఏసీ కారణంగా ఏర్పడే అనేక ఆరోగ్య సమస్యలకు (Health problems) దూరంగా ఉండగలం.