పాటలు వినే అలవాటుందా? అయితే మీరు ఈ ముచ్చట ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!
మనలో చాలా మంది పాటలను బాగా వింటుంటారు. హమ్ కూడా చేస్తుంటారు. మన మానసిక స్థితిని బట్టి రకరకాల పాటలను వింటుంటారు. అయితే పాటలను వినడం వల్ల ఎన్నో మానసిక ప్రయోజనలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మన దైనందిన జీవితంలో సంగీతం ఒక భాగమైపోయింది. పనిచేస్తున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు పాటలను ఖచ్చితంగా వింటుంటాం. లేదా హమ్ చేస్తుంటాం. ఇది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒత్తిడిని చిటికెలో పోగొడుతుంది. నిజానికి సంగీతం మన మానసిక ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Freepik
జ్ఞాపకశక్తి పెరుగుతుంది
మ్యూజిక్ మీ జ్ఞాపకశక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. మ్యూజిక్ గుర్తుంచుకోవడం, మాట్లాడటం, భావోద్వేగాలకు బాధ్యత వహించే మన మెదడులోని భాగాలను సక్రియం చేస్తుంది. అందుకే అల్జీమర్స్ రోగులకు ఇది ప్రయోజకరంగా ఉంటుంది. మ్యూజిక్ ను చిత్తవైకల్యం లక్షణాలను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు.
nervous system
ఆత్రుతను తగ్గిస్తుంది
మ్యూజిక్ ను వినడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అలాగే చంచలత తగ్గుతుంది. ఇది మీ హృదయ స్పందన రేటును కూడా తగ్గిస్తుంది. అలాగే మ్యూజిక్ ఒత్తిడి హార్మోన్లను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే యాంగ్జైటీని తగ్గిస్తుంది. మ్యూజిక్ ను వినడం వల్ల మీ సమస్యల నుంచి మీ దృష్టిని మళ్లుతుంది. దీనివల్ల మీరు విశ్రాంతి తీసుకుంటారు.
రిలాక్స్
కొన్ని కారణాల వల్ల మూడీగా ఉండటం సహజం. అయితే ఇలాంటి సమయంలో పాటలను వింటే చాలా తక్కువ సమయంలో దీని నుంచి బయటపడతారు. సంగీతం మీ మనస్సును రిలాక్స్ చేస్తుంది. దీంతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది.
మంచి నిద్ర
మ్యూజిక్ ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ను తగ్గిస్తుంది. దీంతో మీ శరీరం రిలాక్స్ గా ఉంటుంది. మన శరీరం, మనసు రిలాక్స్ అయితే నిద్ర కూడా బాగా పడుతుంది. సంగీతం మీ హృదయ స్పందన రేటును కూడా తగ్గిస్తుంది. ఇది కంటినిండా నిద్రపోవడానికి ఒక కారణం.
Image: freepik.com
వ్యాయామం
రాక్ మ్యూజిక్ లేదా సరదాగా అనిపించే పాటలను వింటూ వ్యాయామం చేస్తే మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. ఎక్కువ సేపు వ్యాయామం చేస్తారు. సంగీతం మీ మానసిక స్థితిని పెంచుతుంది. ఇది మిమ్మల్ని మరింత శక్తివంతంగా చేస్తుంది. అలాగే అలసటను తగ్గిస్తుంది.