గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే బీపీని కంట్రోల్ లో ఉంచాలి.. ఇందుకోసం ఏం చేయాలంటే?
ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, శారీరక స్థిరత్వం, స్మోకింగ్ వంటి కొన్ని అలవాట్లు అధిక రక్తపోటు సమస్యకు కారణమవుతాయి. దీనివల్ల గుండెజబ్బుల ముప్పు పెరుగుతుంది. అందుకే అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచాలి.

high blood pressure
ఈ రోజుల్లో అధిక రక్తపోటు సమస్య సర్వసాధారణంగా మారింది. అంతేకాదు ఈ సమస్య యువతకు కూడా వస్తోంది. కానీ ఇది గుండెపోటుతో సహా ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. కొన్ని ఆహారాలు, ఆహార కారకాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే మధుమేహం, ఊబకాయంతో బాధపడే వారికి అధిక రక్తపోటు సమస్య వచ్చే ప్రమాదం ఉంది. స్మోకింగ్, మందును ఎక్కువగా తాగే వారికి కూడా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది.
అయితే అధిక రక్తపోటును నియంత్రించడం పెద్ద కష్టమేమీ కాదు. మీ జీవనశైలి, ఆహారంలో కొన్ని అవసరమైన మార్పులు చేసుకుంటే దీన్ని సులువుగా నియంత్రించొచ్చు. రక్తపోటును ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
wheatgrass juice
వీట్ గ్రాస్ జ్యూస్
అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తికి వీట్ గ్రాస్ జ్యూస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నార్మల్ గా ఉంచుతాయి. అందుకే మీ ఆహారంలో తగినంత మొత్తంలో మెగ్నీషియం, పొటాషియాన్ని తీసుకోవాలి. అలాగే మీ డాక్టర్ ను సంప్రదించి రక్తపోటు మందుల మోతాదును తగ్గించొచ్చు. ఇది కాకుండా వీట్ గ్రాస్ జ్యూస్ మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
తగినంత పొటాషియం
మన శరీరంలోని అన్ని కణాలు సరిగ్గా పనిచేయడానికి పొటాషియం చాలా అవసరం. సోడియాన్ని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో నీరు ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంటుంది. అలాగే తక్కువ పొటాషియాన్ని తీసుకోవడం, ఎక్కువ సోడియం రక్తపోటును పెంచుతాయి. పొటాషియం రక్త నాళాలను సడలిస్తుంది. అలాగే శరీరంలో ఉన్న నీరు, ఉప్పును తొలగిస్తుంది. దీంతో మీ రక్తపోటు సాధారణంగా ఉంటుంది. అరటిపండ్లు, పుచ్చకాయలు, బంగాళాదుంపలు, టమాటాలు, బొప్పాయి, నారింజ, బచ్చలికూర, సోయాబీన్స్, బాదం, ధాన్యాల ద్వారా శరీరంలో పొటాషియం తగినంత మొత్తంలో ఉంటుంది.
స్కిమ్డ్ పాలు
స్కిమ్డ్ పాలు కాల్షియం, విటమిన్ డి కి అద్భుతమైన మూలం. ఈ రెండు పోషకాలు రక్తపోటును నార్మల్ గా ఉంచడానికి సహాయపడతాయి. వీటితో పాటుగా ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటు రోగులకు మేలు చేస్తుంది.
కూరగాయలు
పార్స్లీ లేదా సెలెరీలో ఒక రకమైన ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది ధమనుల కణజాల కండరాలను సడలిస్తుంది. అలాగే రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా టమాటాల్లో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అలాగే అధిక రక్తపోటు ఉన్నవారు బ్రోకలీ, క్యాబేజీ వంటి గ్లూటామిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే కూరగాయలను కూడా తినొచ్చు. ఆకుకూరల్లో ఎన్నో ముఖ్యమైన ఖనిజాలు, కాల్షియం, పొటాషియం, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో ఎన్నో రకాల ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్త నాళాలలో ఫలకం పేరుకుపోనివ్వవు. అలాగే రక్తపోటును సాధారణంగా ఉంచడానికి సహాయపడతాయి.
Image: Getty Images
కొబ్బరి నీరు
కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్స్, పొటాషియం కు అద్భుతమైన మూలం. కొబ్బరి నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
garlic
వెల్లుల్లి
వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తనాళాలు విస్తరిస్తాయి. దీంతో రక్తం సులభంగా సరఫరా అవుతుంది. మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే మీరు పచ్చి లేదా వండిన వెల్లుల్లిని తినొచ్చు. సరైన ఫలితాల కోసం మీరు రెండు వెల్లుల్లి మొగ్గలను ఖాళీ కడుపుతో 2 నెలల పాటు క్రమం తప్పకుండా తినండి.
పెరుగు
క్రమం తప్పకుండా ఒక కప్పు పెరుగును తింటే అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది. పెరుగులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి రక్తపోటును తగ్గించే మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది అధిక రక్తపోటు రోగులకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.