MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా అయితే ఈ చిట్టి చిట్కా పాటించండి!

పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా అయితే ఈ చిట్టి చిట్కా పాటించండి!

 పొట్ట చుట్టూ పేరుకుపోయిన అధిక కొవ్వు (Fat) కారణంగా అనేక అనారోగ్య సమస్యలు (Illness issues) వచ్చే అవకాశం ఉంటుంది. పొట్ట దగ్గర ఉన్న కొవ్వును కరిగించడం చాలా కష్టం. శరీరానికి ఎంత శారీరక శ్రమను అందించినా మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలను పాటిస్తే కొవ్వును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి కొవ్వును తగ్గించే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G | Asianet News
Published : Jan 22 2022, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కారణంగా శరీరం ఒత్తిడికి (Stress) లోనవ్వడం, స్థూలకాయం (Obesity), గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలోని హార్మోన్ల మార్పు కూడా పొట్ట దగ్గర కొవ్వు పెరగడానికి కారణం కావచ్చు.
 

29

మనం తీసుకునే ఆహారంలో జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు (Vitamins), ఖనిజాలు (Minerals) సమృద్ధిగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది. శరీరానికి వ్యాయామంతో పాటు, సరైన ఆహారాన్ని అందించడం ముఖ్యం.
 

39

జీడిపప్పు, వేరుశనగ: జీడిపప్పు (Cashew), వేరుశనగలో (Peanuts) కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినకుండా కాయగూరలు పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది. తృణధాన్యాలు పప్పుధాన్యాలు కాస్త పరిమితంగానే తినడం మంచిది.
 

49

వెల్లుల్లి, ఉల్లిపాయ: వెల్లుల్లి (Garlic), ఉల్లిపాయలు (Onion) యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించి పొట్ట భాగాన్ని నాజుగ్గా చేస్తాయి. కనుక రోజుకు మూడు పచ్చి వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిపాయ తినడం మంచిది. ఇవి శరీరంలోని కొవ్వును నెమ్మదిగా కరిగిస్తాయి.
 

59

తాజా పండ్లు, కూరగాయలు: తాజా పండ్లలో (Fruits) విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కూరగాయలు (Vegetables) ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. బ్రోకలీ, టొమోటో, పాలకూర, బీన్స్, బఠాణీలు, క్యాబేజీ వంటివి ఎక్కువగా తీసుకోవడం మంచిది.
 

69

దోసకాయ, అల్లం: దోసకాయలలో (Cucumber) విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరిచి పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి సహాయపడుతాయి. అదేవిధంగా అల్లంలో (Ginger)  కూడా పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి పొట్ట దగ్గర ఉన్న కొవ్వు తగ్గించడానికి సహాయపడుతాయి.
 

79

గుడ్లు: గుడ్లలో (Eggs) ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ఖనిజలవణాలు యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) సమృద్ధిగా ఉంటాయి. వీటితోపాటు లెనిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. రోజూ అల్పాహార సమయంలో ఒక గుడ్డును తీసుకోవడం మంచిది.
 

89

ఓట్స్, పెరుగు: ఓట్స్ (Oats) ను డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇవి శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు పదార్థాలను కరిగించడానికి సహాయపడతాయి. అదేవిధంగా పెరుగులో (Yogurt) అనేక ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్లు బరువును తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి.
 

99

వీటితో పాటు పాలు, చేపలు, మొలకలు పుట్టగొడుగులు, సోయా వంటి పదార్థాలను తీసుకుంటూ సరైన నిద్ర (Proper sleep), వ్యాయామం (Exercise) అలవరచుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి పొట్ట భాగం నాజూగ్గా తయారవుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ శరీరానికి నిజంగా బిర్యానీ అవసరమా? 60 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా !
Recommended image2
Summer: ఎండలని కూల్ వాటర్ తాగుతున్నారా? తర్వాత జరిగేది ఇదే..!
Recommended image3
Tea: రోజూ టీ తాగుతున్నారా? ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved