డయాబెటీస్ రావొద్దంటే ఒక్క స్వీట్లను మానేస్తే సరిపోదు..!
diabetes: మన దేశంలో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మన ఆహారపు అలవాట్లు, జీవన శైలే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధి బారిన పడితే శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆరోగ్యం కూడా తరచుగా దెబ్బతింటుంది. అందుకే ఈ వ్యాధి రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
diabetes
డయాబెటీస్ పేషెంట్లు తీపి పదార్థాలు తినకూడదని చెప్తుంటాము. ఎందుకంటే ఈ తీపి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తుంది. అంటే ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే తీపిని తినకుంటే సరిపోతుందా? అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు. అవును ఒక్క తీపి పదార్ధాలతోనే డయాబెటీస్ రాదు. కొన్ని అలవాట్లు కూడా ఇందుకు కారణమవుతాయి. మరి డయాబెటీస్ రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.
diabetes
రోజూ వ్యాయామం
వ్యాయామం మన శరీరాన్ని ఫిట్ గా ఉంచడమే కాదు.. మనల్ని ఎన్నో రోగాలకు కూడా దూరంగా ఉంచుతుంది. మధుమేహం రావొద్దంటే రెగ్యులర్ గా కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయండి. అంటే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, యోగా, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, ఇలా ఏది చేసినా.. మీకు డయాబెటీస్ యే కాదు ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. వ్యాయామం హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శారీరక శ్రమ డయాబెటిస్ ప్రమాదాన్ని చాలావరకు తగ్గిస్తుంది.
പച്ചക്കറികൾ
ఆహారపు అలవాట్లు
ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే ఈ అలవాట్లను మాత్రం మానలేకపోతుంటారు. కానీ ఇవి మిమ్మల్ని ఎన్నో రోగాలకు గురించేస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాలనే మాత్రమే తినండి. అలాగే ఒకేసారి కాకుండా రోజుకు మూడు, నాలుగు సార్లు తక్కువ మొత్తంలో తినండి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి. ఎందుకంటే వీటిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కానీ జంక్, వేయించిన, ప్రాసెస్ ఫుడ్ ను మాత్రం అస్సలు తినకండి. ఇవి కూడా డయాబెటీస్ వచ్చేలా చేస్తాయి.
diabetes
ఉప్పు, పంచదార నియంత్రణ
ఉప్పు మంచిదే. కానీ మోతాదుకు మించి తింటే లేనిపోని రోగాలు వస్తాయి. అలాగే చక్కెరను కూడా తక్కువ పరిమాణంలోనే తినాలి. రాత్రిపూట వీటిని మొత్తమే తినకపోవడమే మంచిది. వీటికి బదులుగా మీరు బెల్లాన్ని తినండి. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
diabetes
ధూమపానం, మద్యపానానికి దూరం
సిగరెట్లు, ఆల్కహాల్ వల్ల ఒక్కటేమిటీ ఎన్నో రోగాలు వస్తాయి. ఈ అలవాట్ల వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఊబకాయం బారిన పడతారు. షుగర్ తో పాటుగా ఎన్నో రోగాలు వస్తాయి. అందుకే వీటికి దూరంగా ఉండండి.
diabetes diet
బరువును అదుపులో
ప్రీ డయాబెటిక్ ఉన్నవారు బరువు తగ్గితే డయాబెటిస్ ను చాలా వరకు నివారించొచ్చు. డయాబెటిస్ పేషెంట్లకు కూడా ఇది వర్తిస్తుంది. బాడీ మాస్ ఇండెక్స్ 18, 23 మధ్య ఉంచండి.ఇది మీ సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే మీరు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నవాటిని తినండి.