కిడ్నీ స్టోన్స్ వల్ల విపరీతంగా నొప్పి పెడుతోందా? ఇలా చేస్తే నొప్పి చిటికెలో తగ్గిపోతుంది
కొన్ని రకాల ఆహారాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇవి ఎన్నో రోగాల లక్షణాలను కూడా తగ్గించడానికి సహాయపడతాయి. వీటిని తింటే కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పి కూడా తగ్గిపోతుంది.
kidney stone
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మూత్రపిండాల రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ఎన్నో కారణాలున్నాయి. ఓవర్ వెయిట్, మందులు, సప్లిమెంట్స్, ఎన్నో అనారోగ్య సమస్యల వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి.
మూత్రపిండాల్లోని రాళ్లు మూత్రపిండాల నుంచి మూత్రాశయం వరకు మన మూత్ర మార్గంలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేస్తేంది. అయితే మూత్రపిండాల రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి పుడుతుంది. ఈ నొప్పిని భరించడం చాలా కష్టం. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలను తింటే ఈ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
kidney stone
నీళ్లను ఎక్కువగా తాగాలి
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు నీళ్లను ఎక్కువగా తాగాలి. ఎందుకంటే నీళ్లు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. నీళ్లను ఎక్కువగా తాగితే కిడ్నీ స్టోన్స్ కూడా కరిగిపోతాయి. అందుకే వీళ్లు రోజుకు కనీసం 2.5 లీటర్ల నీటిని తాగాలి. అంటే రోజుకు 10 గ్లాసుల నీటిని తాగాలి.
ఆక్సలేట్ ఉండే ఆహారాన్ని తగ్గించడం
నేషనల్ కిడ్నీ ఫౌండర్ ప్రకారం.. మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడుతున్నప్పుడు బెర్రీలు, చాక్లెట్, బచ్చలికూర, గోధుమ రవ్వ, గింజలు, దుంపలు, టీ వంటి ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇవి కిడ్నీస్టోన్స్ ను మరింత పెంచుతాయి.
కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం
కాల్షియం ఒక పోషకం. ఇది మన ఎముకలను, దంతాలను, కండరాలను బలంగా ఉంచుతుంది. అందుకే ఇది మన శరీరానికి చాలా చాలా అవసరం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలను పుష్కలంగా తినాలి.
మితమైన ప్రోటీన్
మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ప్రోటీన్ ను మరీ ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే దీనివల్ల మూత్రపిండాలు ఎక్కువ కాల్షియం ను బయటకు పంపుతాయి. దీంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ తెలిపింది. అందుకే ప్రోటీన్ ను మోతాదులో తినండి.
ఉప్పును తగ్గించడం
మూత్రంలో ఉప్పు స్థాయిలు ఎక్కువగా ఉండే కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మీరు రోజుకు ఉప్పును 1,500 నుంచి 2,000 మిల్లీగ్రాముల్లోనే తినండి. అంటే ఇది అర టీస్పూన్ ఉప్పుకు సమానం. మీ ఆహారంలో ఉప్పును వీలైనంత తక్కువగా చేర్చండి.