వర్షాకాలంలో కూడా చేపలు తింటున్నరా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
ఇతర మాంసాహారాల కంటే చేపలే మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. అందుకే వీటిని వారానికోసారైనా తినేవారు చాలా మందే ఉన్నారు. కానీ చేపలను వర్షాకాలంలో తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే?

fatty fish
కాలాలతో సంబంధం లేకుండా చేపలను చాలా మంది తింటుంటారు. నిజానికి చేపలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ చేపలను వర్షాకాలంలో తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్ లో నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. దీంతో సీఫుడ్ ప్రమాదకరమైన సూక్ష్మక్రిములకు ఎక్కువగా గురవుతుంది. వీటిని తింటే మనకు లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
వర్షాకాలంలో సీఫుడ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు
సీఫుడ్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని.. ముఖ్యంగా మన మెదడు, కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మన రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచుతాయి. కానీ వర్షాకాలంలో వీటిని తింటే కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty
నీటి కాలుష్యం
వర్షపు నీరు భూమిపై ఉన్న కాలుష్య కారకాలను నదులు, సరస్సులు, సముద్రాలలోకి చేరుస్తుంది. దీంతో నీటి కాలుష్యం పెరుగుతుంది. చేపలు, ఇతర సీఫుడ్ జాతులు ఈ కాలుష్య కారకాలను తీసుకోవచ్చు. ఇవి వారి శరీరంలోనే పేరుకుపోతాయి. ఇలలా కలుషితమైన సీఫుడ్ ను తినడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Image: Getty
పాదరసం విషం
సీఫుడ్ తినడం వల్ల వచ్చే మరో సమస్య పాదరసం విషం. పాదరసం అనేది విషపూరిత హెవీ మెటల్. ఇది చేపలు, ఇతర సీఫుడ్ కణజాలాలలో పేరుకుపోతుంది. ముఖ్యంగా ట్యూనా, స్వోర్డ్ ఫిష్, షార్క్ వంటి పెద్ద వేటాడే చేపల్లో ఎక్కువగా ఉంటుంది. రుతుపవనాల వల్లే ఈ పాదరసం స్థాయిల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. కాబట్టి మీరు తినే చేపల రకాలు, వాటి పరిమాణాల గురించి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మనం కలుషితమైన చేపలను తిన్నప్పుడు మన శరీరంలో ప్రమాదకరమైన స్థాయిలో పాదరసం పేరుకుపోతుంది. మానసిక స్థితి మార్పులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, కండరాల బలహీనత వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అంతేకాదు పాదరసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల నాడీ సమస్యలు వస్తతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లల్లో.
fish
పర్యావరణ కలుషితాలు
పాదరసంతో పాటుగా సీఫుడ్ పాలీక్లోరినేటెడ్ బైఫెనైల్స్ (పిసిబి) వంటి ఇతర పర్యావరణ కాలుష్య కారకాల వల్ల కలుషితం కావొచ్చు. ఇవి చేపల కణజాలాలలో పేరుకుపోతాయి. అలాగే ఇవి మనకు ఎన్నో ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి.
Image: Getty
సీఫుడ్ కు అలెర్జీ
కొంతమందికి కొన్ని రకాల చేపలు లేదా సీఫుడ్ కు అలెర్జీలు లేదా సున్నితత్వం ఉండొచ్చు. వర్షాకాలంలో రోగనిరోధక వ్యవస్థ మరింత బలహీనంగా ఉంటుంది. దీనివల్ల ఈ అలెర్జీలు ఎక్కువవుతాయి. సీఫుడ్ అలెర్జీ సాధారణ లక్షణాలు తేలికపాటి నుంచి తీవ్రమైనవిగా ఉంటాయి. దద్దుర్లు, ముఖం, పెదవులు, నాలుక లేదా గొంతుపై వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా కడుపు నొప్పి, వికారం లేదా వాంతులు సీఫుడ్ అలెర్జీ లక్షణాలు.
Image: Getty
పరాన్నజీవి అంటువ్యాధులు
వర్షాకాలంలో జలవనరుల్లో పరాన్నజీవుల పెరుగుదలకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. చేప, సీఫుడ్ టేప్వార్మ్లు, గుండ్రని పురుగులు, ఫ్లూక్స్ వంటి పరాన్నజీవులను కలిగి ఉండొచ్చు. ఇవి తీసుకున్నప్పుడు పరాన్నజీవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఈ అంటువ్యాధులు జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. సోకిన సీఫుడ్ తిన్న తర్వాత విరేచనాలు, ఉబ్బరం లేదా వాయువుకు కారణమవుతాయి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేస్తాయి. చేపలు, సీఫుడ్ ను సరిగ్గా ఉడికించి మాత్రమే తినాలి.