బిజీ లైఫ్ స్టైల్ లో రెగ్యులర్ యోగా ఎందుకు ముఖ్యమో తెలుసా?
సోషల్ సర్కిల్స్ తగ్గిపోవడం, స్క్రీన్ టైం పెరగడం వల్ల నిద్రలేమి, డిప్రెషన్ వంటి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు ప్రస్తుతం చాలా మంది. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆధునిక జీవనశైలిలో యోగా మనకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Photo Courtesy: Instagram
యోగా మన జీవితంలో ఒక అంతర్భాగం. ఇది మన శరీరానికి, మనస్సుకు, ఆత్మకు సంతృప్తిని అందించే మానసిక-శారీరక, ఆధ్యాత్మిక వ్యాయామం అంటారు నిపుణులు. యోగా ద్వారా మనలో చైతన్యం మేల్కొంటుంది. ఇది మన దైనందిన జీవితంలో చిన్న చిన్నఇబ్బందుల నుంచి ఎన్నో సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఒత్తిడితో బాధపడుతున్నారు. సోషల్ సర్కిల్స్ తగ్గి స్క్రీన్ టైమ్ పెరగడంతో ఈ సమస్య మరింత పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఎంతో మంది డిప్రెషన్, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆధునిక జీవనశైలిలో యోగా మనకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచ యోగా దినోత్సవం 2023
యోగాను ప్రోత్సహించడానికి, దీన్ని ప్రచారం చేయడానికి జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం ప్రజలలో ఆరోగ్య అవగాహనను కలిగించడం. ఈ ఏడాది ప్రపంచ యోగా దినోత్సవం 2023 థీమ్ 'వసుధైవ కుటుంబం', అంటే యోగా ద్వారా యావత్ ప్రపంచ శ్రేయస్సు కోసం ఏకం కావడం. ప్రతి సంవత్సరం జరుపుకునే యోగా దినోత్సవం సందర్భంగా,..ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దీనిలో జనాలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
Yoga Day
యోగా తో ఒత్తిడిని, ఆందోళను, డిప్రెషన్ ను అధిగమించవచ్చని ఎన్సీబీఐ తెలిపింది. పరిపూరకరమైన ఔషధంగా ఉపయోగించే యోగా మన శరీరాన్ని మందులు లేకుండా ఆరోగ్యంగా చేస్తుంది. ఎన్నో రోగాల ముప్పు నుంచి రక్షిస్తుంది.
Yoga Day
ఒత్తిడికి యోగా ఎలా సహాయపడుతుంది?
మెంటల్ హెల్త్ ఫౌండేషన్ ప్రకారం.. ఒత్తిడికి గురవుతున్న 51 శాతం మందిలో ఒత్తిడికి ప్రధాన కారణం డిప్రెషన్. 61 శాతం మంది యాంగ్జైటీతో బాధపడుతున్నట్టు వెల్లడించారు. అలాగే 16 శాతం మంది తమకు తాము హాని చేసుకున్నారు. అలాగే 32 శాతం మంది వ్యక్తులు ఆత్మహత్య లేదా తమను తాము హాని చేసుకోవాలనే ఆలోచనలను కలిగి ఉన్నారు. కాగా ఒత్తిడికి గురైన వారిలో 37 శాతం మంది ఒంటరిగా ఉన్నట్టు ఫిర్యాదు చేశారు.
18 నుంచి 24 ఏళ్ల వయసున్న వారిలో 49 శాతం మంది ఎక్కువ మొత్తంలో ఒత్తిడికి గురవుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఏ వయసు వారైనా ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే 36 శాతం మంది మహిళలు తమ శరీరాకృతి, పని కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే పురుషుల సంఖ్య 23 శాతంగా ఉంది.
యోని నిపుణుల ప్రకారం.. యోగా ఒక ఆధ్యాత్మిక అభ్యాసం. యోగా మన మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మనల్ని మానసికంగా, శారీరకంగా బలోపేతం చేస్తుంది. ఇలా చేయడం వల్ల మనం ఉత్సాహంగా, తాజాగా ఉంటాం. ప్రారంభంలో కొన్ని నిమిషాల యోగా మిమ్మల్ని రీఫ్రెష్ గా ఉంచుతుంది. రోజంతా ఒక గంట పాటు చేసే యోగా చేస్తే మిగిలిన 23 గంటల పాటు మీరు శక్తివంతంగా ఉంటారు.
యోగాకు ముందు ఈ ఏర్పాట్లు చేసుకోండి
ముందుగా యోగా కోసం శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి.
ఇప్పుడు రెండు నిమిషాల పాటు కళ్లను మూసుకోండి. మిమ్మల్ని మీరు సిద్దం చేసుకోండి.
దీనివల్ల మీ మనస్సు తేలిగ్గా మారుతుంది. మీరు మునపటి కంటి మరింత ప్రశాంతంగా ఉంటారు
అంతర్గత సమస్యలు దూరమవుతాయి. అయితే ప్రారంభంలో రెండు నిమిషాలు మాత్రమే యోగా చేయండి. ఆ తర్వాత దీని కాలపరిమితిని పొడిగించండి.