బరువు వేగంగా తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా అయితే ఈ అనారోగ్య సమస్యలు రావడం ఖాయం!
ప్రస్తుత కాలంలో అందరినీ వేదనకు గురిచేస్తున్న సమస్య అధిక బరువు (Overweight).. కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై సరైన శారీరక శ్రమ లేక అధిక మొత్తంలో బరువు పెరిగిపోతున్నారు. దీంతో బరువు తగ్గించుకోవడానికి ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇలా అమ్మాయిలు, అబ్బాయిలు బరువు తగ్గించుకునే సమయంలో తొందరగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇలా తక్కువ సమయంలో బరువు తగ్గడం సరైనది కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇలా వేగంగా బరువు తగ్గితే అనేక ఆరోగ్య సమస్యలు రావడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా బరువు వేగంగా తగ్గితే ఎదురయ్యే అనారోగ్య సమస్యల (Illness issues) గురించి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
బరువు తగ్గడం మంచిదే. కానీ తక్కువ సమయంలో (Less time) తొందరగా బరువు తగ్గాలనే ఆలోచన మంచిది కాదు. ఇలా వేగంగా బరువు తగ్గే విషయంలో అమ్మాయిలు ఎక్కువ దృష్టి (Focus) పెడుతున్నారు. టీవీలలో, పేపర్ లలో చూపించే సన్నబడే ప్రకటనలు చూసి వాటిని అనుసరిస్తుంటారు. మరికొందరైతే చూసినవన్నీ ప్రయత్నిస్తుంటారు. ఇలా వేగంగా బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిది కాదు.
ఒకవేళ బరువు తగ్గినా అది తాత్కాలిక (Temporary) ఆనందాన్ని మాత్రమే అందిస్తుంది. ఫలితంగా దీర్ఘకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కనుక ఒక క్రమ పద్ధతి అనుసరిస్తూ (Following) బరువు తగ్గడానికి ప్లాన్ చేసుకుంటే మంచిది.
అయితే అందరి శరీరం తీరు ఒకేలా ఉండదు. ఒక్కొక్కరిదీ ఒక్కో శరీర తత్వం (Body philosophy) ఉంటుంది. కనుక మన శరీరానికి తగ్గట్టుగా డైట్ ను అనుసరిస్తూ, సరైన వ్యాయామాలను చేస్తే ఆరోగ్యంగా మన శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఇది బరువు తగ్గడానికి ఉత్తమమైన పద్ధతి (Best method).
తక్కువ సమయంలో బరువు తగ్గిన వారిలో ఎలక్ట్రోలైట్ ల అసమతుల్యత (Electrolyte imbalance), న్యూట్రీషియన్ డెఫిషియన్సీ, థైరాయిడ్ సమస్యలు (Thyroid problems) వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక పోషకాహారాలను తీసుకుంటూ సరైన పద్ధతిలో బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. నెలకు రెండు నుంచి నాలుగు కిలోల బరువు కన్నా ఎక్కువ దగ్గరరాదు.
తక్కువ సమయంలో బరువు తగ్గిన వారిలో ఎలక్ట్రోలైట్ ల అసమతుల్యత (Electrolyte imbalance), న్యూట్రీషియన్ డెఫిషియన్సీ, థైరాయిడ్ సమస్యలు (Thyroid problems) వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక పోషకాహారాలను తీసుకుంటూ సరైన పద్ధతిలో బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. నెలకు రెండు నుంచి నాలుగు కిలోల బరువు కన్నా ఎక్కువ దగ్గరరాదు.
అలాగే బరువు తగ్గాలని డైట్ విషయంలో ఏ పదార్థాలు తినకుండా ఉండరాదు. నోరు కట్టేసుకుని డైట్ చేస్తే శరీరంలో ఒక్కసారిగా కేలరీలు (Calories) తగ్గి ఇబ్బంది పడతారు. ఇలా చేస్తే మూత్రపిండ సంబంధిత వ్యాధులు (Kidney related diseases) వచ్చే అవకాశం ఉంటుంది. కనుక తొందరగా బరువు తగ్గాలనుకుంటే ఇన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తేప్రమాదం ఉంది.
ఇలా తొందరగా బరువు తగ్గితే మీకు తాత్కాలిక ఆనందం మాత్రమే మిగులుతుంది. కనుక బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే మీరు రోజూ తీసుకునే ఆహార పదార్థాల మీద సరైన శ్రద్ధ తీసుకుంటూ శారీరక శ్రమ అందించే వ్యాయామం (Exercise), యోగా (Yoga) వంటి వాటిని అనుసరిస్తూ ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.