Health Tips: మీరు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు?
Health Tips: నేటి కాలంలో చాలామంది మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇది ఎంత ప్రమాదమో తెలుసా.. దీనిని అంత తేలికగా తీసుకోకండి. దీని నివారణ చర్యలు ఏంటో చూద్దాం రండి.

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి లేని జీవితాన్ని ఊహించలేము. ఒత్తిడిని ఏదైనా శారీరక రసాయనిక ఉద్వేగ ఫలితమైన అంశంగా పరిగణించవచ్చు. ఈ ఉద్వేగం ఒక పరిధిని దాటితే అది తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది.
దీనివల్ల అనేకమైన శారీరక రుగ్మతలు సంభవిస్తాయి. సమయానికి నిద్ర పట్టకపోవడం సమయానికి ఆకలి వేయకపోవడం. ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువైనప్పుడు గుండె సంబంధిత వ్యాధులు, జీర్ణ వ్యవస్థకి సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు.
చాలామందిలో కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి కనిపిస్తాయి. మరి కొంతమంది పరీక్షలకు లేకపోతే ఇంటర్వ్యూకి హాజరవ్వటానికి కొన్ని గంటల ముందు తీవ్రంగా మానసిక పత్రిక గురవుతూ ఉంటారు ఫలితంగా కడుపులో తిప్పినట్లు అనిపించడం మాటిమాటికీ మల్ల విసర్జనకు వెళ్లాల్సి రావటం వంటివి జరుగుతూ ఉంటాయి.
ఇదంతా మానసిక ఒత్తిడి వల్లనే అని గుర్తించండి. అయితే ఈ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి వ్యాధి ముదిరిపోకుండా చిన్ని చిన్ని జాగ్రత్తలతో ఈ అనారోగ్యం వారి నుంచి బయటపడవచ్చు అదెలాగో చూద్దాం. బలమైన ఆహారం తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది అందువల్ల నెగిటివ్ ఆలోచనలు రావు.
శరీరం మొత్తం ఆక్టివేట్ అవుతుంది అందుకే విటమిన్లు, మినరల్స్ ఉండే పోషకాలు ఎక్కువ తీసుకోమంటున్నారు మానసిక నిపుణులు. అలాగే ఒక విషయాన్ని అతిగా ఆలోచించకూడదు. శారీరకంగా శ్రమ మీద దృష్టి పెడితే మనల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనల నుంచి మనం దూరంగా ఉండొచ్చు.
అలాగే ఒత్తిడిగా అనిపించినప్పుడు పదిమందిలో కలవడానికి ప్రయత్నించండి. ఒంటరిగా ఉంటే ఒత్తిడి మరింత పెరుగుతుంది. అలా అని విశ్రాంతి లేకుండా పనులు చేసినా కూడా మంచిది కాదు. తగినంత నిద్ర కూడా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి ఈ విషయాలు మీద దృష్టి పెట్టండి. అదే పనిగా ఆలోచిస్తూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి.