షుగర్ మాత్రమే కాదు.. ఐస్ క్రీం కూడా బరువు పెరిగేలా చేస్తుంది జాగ్రత్త..
మండుతున్న ఎండుల్లో చల్లగా ఐస్ క్రీం ను తినాలనిపిస్తుంది. ఐస్ క్రీం తో శరీరం చల్లగా మారుతుంది. కానీ ఐస్ క్రీం ను ఎక్కువగా తింటే బరువు బాగా పెరిగిపోతారు.

ఎండాకాలంలో మనల్ని మనం చల్లగా ఉంచుకోవడానికి ఐస్ క్రీంను తింటుంటాం. దీన్ని తిన్న వెంటనే చల్లగా, ఫ్రెష్ గా అనిపిస్తుంది. క్రీమీ, తీయని, చల్లని, రిఫ్రెషింగ్ ఐస్ క్రీం లో ప్రోటీన్లు, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో ఎక్కువ మొత్తంలో కొవ్వు, చక్కెరలు ఉంటాయి. ఇది కేలరీలను తీసుకోవడాన్ని పెంచుతుంది. ఐస్ క్రీం ను ఎక్కువగా తింటే మీరు ఖచ్చితంగా బరువు పెరుగుతారు. అసలు ఐస్ క్రీం ను ఎక్కువగా తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ice cream
ఊబకాయం
1/2-కప్పు ఐస్‌క్రీమ్‌లో 7.2 గ్రాముల కొవ్వు, 137 కేలరీలు ఉంటాయి. ఇందులో దాదాపుగా 4.5 గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది. ½ కప్పు చాక్లెట్ ఐస్ క్రీమ్‌లో 143 కేలరీలు, 7.3 గ్రాముల కొవ్వు ఉంటుంది. దీనిలో 4.5% సంతృప్త కొవ్వు ఉంటుంది. సాంప్రదాయ ఐస్ క్రీం లు చక్కెర, ఎక్కువ కొవ్వు పదార్థాలతో తయారవుతుంది. ఎక్కువ చక్కెర, కొవ్వు పదార్ధాలను క్రమం తప్పకుండా తీసుకుంటే మీరు బరువు పెరుగుతారు.
కొవ్వు
సంతృప్త కొవ్వు ఆమ్లాలు సాధారణంగా మాంసం, పాలు, గుడ్లు, వెన్న వంటి జంతు ఉత్పత్తుల్లో ఉంటుంది. సంతృప్త కొవ్వును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇది ధమనుల్లో అడ్డంకిని కలిగిస్తుంది. అలాగే గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. బరువు పెరగకూడదంటే సంతృప్త కొవ్వును ఎక్కువగా తీసుకోకూడదు.
కొలెస్ట్రాల్
ఐస్ క్రీంను రెగ్యులర్ గా తింటే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. 1/2 కప్పు ఐస్ క్రీం లో 25 మి.గ్రా కొలెస్ట్రాల్ ఉంటుంది. మన శరీరం రోజుకు 1,000 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ను స్వయంగా ఉత్పత్తి చేస్తుంది. బరువు పెరగడానికి కొలెస్ట్రాల్ యే ప్రధాన కారణం.
ఐస్ క్రీం తినడం వ్యసనం
కొంతమంది క్రమం తప్పకుండా చక్కెర పదార్థాలను తింటుంటారు. ఇలాంటి వారు తీపి పదార్థాలను తినకుండా ఉండలేరు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత ఏదో ఒక తీపి పదార్థాన్ని తింటుంటారు. అలాగే ఐస్ క్రీమ్ ను క్రమం తప్పకుండా తింటాు. ఈ అలవాటు వారికి వ్యసనంలా పనిచేస్తుంది. దీనివల్ల అదనపు బరువు పెరుగుతారు.
<p>ice cream</p>
ఎక్కువ కొవ్వు దుష్ప్రభావాలు
రెగ్యులర్ గా ఐస్ క్రీమ్ ను ఎక్కువగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. హై ఫ్యాట్ క్రీమ్ ను సాధారణంగా ఐస్ క్రీమ్ లో ఉపయోగిస్తారు. ఈ ఎక్కువ కేలరీలు, చక్కెర కంటెంట్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకే ఐస్ క్రీం ను ఎక్కువగా తినకూడదు. దీన్ని రోజూ కాకుండా వారానికి ఒకసారి తినడం అలవాటు చేసుకోండి. తక్కువ కొవ్వు లేదా కొవ్వు మొత్తమే లేని, చక్కెర లేని ఐస్ క్రీం లను మాత్రమే తినండి.
ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి
ఐస్ క్రీంకు బదులుగా తక్కువ కొవ్వు ఉన్న పెరుగును తినండి. కేలరీలను తగ్గించుకోవడానికి పొటాషియం వంటి పోషకాలున్న ఆహారాన్ని తినండి. దీని కోసం అరటిపండును ఫ్రీజ్ చేయండి. దీన్ని బ్లెండర్ లో గ్రైండ్ చేసుకోం. ఇది ఐస్ క్రీం మాదిరిగానే క్రీమీగా, సహజంగా తీయగా ఉంటుంది. దీనిలో 100 తక్కువ కేలరీలు ఉంటాయి.