తాటి ముంజల కూర.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.. ఎలా చెయ్యాలంటే?
తాటి ముంజలను తీసుకుంటే దాహం తీరడంతో పాటు డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

ఈ ముంజలను నేరుగా తినడంతో పాటు రకరకాల వంటలు (Dishes) కూడా వండుకోవచ్చు. ఈ ముంజలతో చేసుకునే కూర భలే రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం తాటి ముంజల కూర (Thati munjalu curry) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: ఆరు ముదురు తాటి ముంజలు (Ice apples), సగం కప్పు పచ్చి కొబ్బరి (Coconut) తురుము, రెండు టేబుల్ స్పూన్ ల పల్లీలు (Peanuts), రెండు స్పూన్ ల గసాలు (poppy seeds), ఒక స్పూన్ మినపప్పు (Minapappu), ఒక స్పూన్ జీలకర్ర (Cumin), సగం స్పూన్ ఆవాలు (Mustard), ఒక కప్పు ఉల్లిపాయ (Onions) ముక్కలు.
రెండు పచ్చి మిరపకాయలు (Green chillies), రెండు టమోటాలు (Tomatoes), కొన్ని కరివేపాకులు (Curries), పావు స్పూన్ పసుపు (Turmeric), ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), కొద్దిగా కసూరీమేథీ (Kasurimethi), కొత్తిమీర (Coriander) తరుగు, రెండు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
తయారీ విధానం: తాటి ముంజలను పొట్టుతీసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పల్లీలు, గసాలను వేసి వేయించుకొని (Frying) చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, గసాలు, పచ్చి కొబ్బరి తురుము కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి.
ఇప్పుడు మరలా స్టవ్ మీద కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ ల నూనె (Oil) వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరవాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు (Turmeric) ఇలా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించుకోవాలి.
రెండు నిమిషాల తరువాత టమోటా ముక్కలు (Tomato slices) వేసి మగ్గించాలి. టమోటాలు ముక్కలు కాస్త మగ్గిన తరువాత తాటి ముంజలు, ఉప్పు, కారం వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పల్లీల మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయేంత వరకూ ఉడికించుకొవాలి (To cook).
తరువాత ఇందులో కసూరీమేథీ, కొన్ని నీళ్ళు వేసి తాటి ముంజలను మెత్తగా ఉడికించుకోవాలి. కూర నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోని చివరిలో కొత్తిమీర (Coriander) తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) తాటి ముంజలు కూర రెడీ. ఇంకెందుకు ఆలస్యం ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది.