ఆకలి కావడం లేదా? నిమ్మకాయను ఇలా వాడితే సమస్య దూరం..!
మనలో చాలా మందికి అపుడప్పుడు ఆకలిగా అనిపించదు. ఏదీ తినాలనిపించదు. కానీ ఇలా ఫుడ్ ను తినకపోవడం వల్ల శరీరం నీరసించి పోతుంది. అంతేకాదు ఇలాగే చాలా కాలం ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
కొంతమందికి ఆకలి ఎక్కువగా అయితే.. ఇంకొంతమందికి అసలే ఆకలి కాదు. కానీ ఇలా ఆకలి కాకపోవడం వల్ల శరీరం బాగా నీరసించి పోతుంది. ఏదీ చేతకాదు. కొన్ని రోజులకు ఎన్నో రోగాలు కూడా చుట్టుకుంటాయి. ఆకలి కాకపోవడం కూడా మంచిదేనని కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే దీనివల్ల కష్టపడకుండా బరువును, పొట్టను తగ్గించుకోవచ్చు అనుకుంటారు. కానీ ఇది మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది ప్రమాదకరమైన సమస్య అని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య చిన్న పిల్లలకే కాదు పెద్దవయసు వారి వరకు ఎవ్వరికైనా రావొచ్చు. ఆకలి లేకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి కూడా ఈ సమస్యకు దారితీస్తుంది. అయితే నిమ్మకాయతో ఈ సమస్య నుంచి బయపడచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
నిమ్మకాయతో ఆకలి..
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో నిమ్మరసాన్ని కలపండి. దీన్ని తాగండి. నిమ్మకాయ రసం మీ ఆకలిని పెంచుతుంది. అలాగే జీర్ణక్రియ కూడా బాగుంటుంది.
నిమ్మకాయ నల్లఉప్పు
ఆకలిని పెంచడానికి నిమ్మకాయ, నల్ల ఉప్పు కూడా సహాయపడతాయి. ఇందుకోసం నిమ్మకాయను నల్లఉప్పుతో నాకండి. ఇది మీ ఆకలిని పెంచుతుంది. అలాగే జీర్ణక్రియకు సంబంధించిన ఎసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
లవంగం, నల్లమిరియాలు
లవంగాలు, నల్ల మిరియాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అయితే ఈ లవంగం, నల్లమిరియాల పొడి కలిపిన 2 గ్లాసుల నీటిలో 2 నిమ్మాకాయల రసం కలిగి తాగండి. దీనివల్ల మీకు మందుల అవసరమే లేకుండా ఆకలి కలుగుతుంది. ఆకలి లేమి సమస్య పూర్తిగా పోతుంది.
అల్లం, నిమ్మరసం
అల్లం ముక్కను తీసుకుని దానిపై నిమ్మరసంలో నల్ల ఉప్పు కలిపి నమలండి. అల్లం, నల్ల ఉప్పు, నిమ్మరసం కడుపులోకి వెళ్లి ఆకలికి కారణమై జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఒక కప్పు నీటిలో రెండు టీస్పూన్ల ఉసిరి రసం, నిమ్మరసం, తేనెను వేసి కలపండి. ఉదయాన్నే పరగడుపున దీన్ని తాగడం వల్ల మీ ఆకలి పెరుగుతుంది. అంతేకాదు ఇది మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.