Health Tips: త్వరగా బరువు తగ్గాలంటే.. పుల్ల పెరుగుని ఇలా తినాల్సిందే!
Health Tips: బరువు తగ్గటం కోసం చాలామంది నానా ప్రయత్నాలు చేస్తూ వుంటారు. అయితే బరువు తగ్గడం అనేది అంత సులువుగా జరిగే పని కాదు. కానీ పుల్లని పెరుగుని ఆహరం గా ఈ విధంగా తీసుకుంటే త్వరగా బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు అదెలాగో చూద్దాం.
బరువు ఎక్కువగా ఉన్నవారు సన్నగా మారడం అనేది అంత సులువుగా జరిగే పని కాదు. దీనికోసం రోజూ సరియైన వ్యాయామం చేయడం,ఆహారం తీసుకోవడంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేస్తే సులభంగా బరువు తగ్గవచ్చు. ఖర్జూరం, వాల్ నట్స్ డ్రైఫ్రూట్స్ తినవచ్చు.
నట్స్ లో ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని అదనపు కొవ్వును క్యాలరీలను బర్న్ చేయడంలో బాగా పనిచేస్తాయి. అలాగే బరువు తగ్గడానికి చియా సీడ్స్ కూడా ఎంతో ఉపయోగపడతాయి. బరువు తగ్గటానికి చియా గింజలను తినమని డాక్టర్లు సైతం చెబుతున్నారు.
దీనిలో ఫైబర్, ఐరన్, పొటాషియం, ఉంటాయి. చియా గింజలతో స్మూతీస్ తయారు చేయవచ్చు. స్మూతీ తయారు చేయడం కోసం వివిధ రకాల పండ్లు, పాలు, పెరుగు మరియు కొన్ని చియా గింజలను బ్లెండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేయండి.
స్మూతీని గ్లాసులో పోసి పైన కొన్ని చియాగింజలు జల్లి తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది.అలాగే పెరుగులో ఉండే ప్రోటీన్, క్యాల్షియం, రిబో ఫ్లేవిన్, విటమిన్ బి 6, విటమిన్ బి12, ఉండటం వలన మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అన్ని అందిస్తాయి.
అయితే పెరుగుని సరి అయిన సమయంలో తినాలి. రాత్రి పూట పెరుగు తినటం అంత మంచిది కాదు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక కప్పు పెరుగు తినటం వలన మీ శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. మధ్యాహ్నం పూట పెరుగు తినటం వల్ల బరువు తగ్గటానికి చాలా సహాయపడుతుంది. అలాగే పెరుగు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. నిద్ర సమస్యలను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది