టెడ్డీ బేర్ ని హగ్ చేసుకుని పడుకుంటే..!
చాలా మందికి టెడ్డీ బేర్ ను హగ్ చేసుకుని పడుకునే అలవాటు ఉంటుంది. నిజానికి ఇది మన మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు.

టెడ్డీబేర్లు చాలా మృదువుగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని హగ్ చేసుకుని పడుకుంటుంటారు. ముఖ్యంగా పిల్లలు. కానీ చాలా మంది పెద్దవయసు వారు టెడ్డీ బేర్లు, దిండ్లు లేకుండా అస్సలు నిద్రపోరు. ఇలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? నిపుణుల ప్రకారం.. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళనను కూడా తగ్గిస్తుంది. మెత్తని దిండ్లు, టెడ్డీ బేర్లను కౌగిలించుకుని నిద్రపోవడం వల్ల మనకు ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎన్ఐహెచ్ న్యూస్ ఇన్ హెల్త్ ప్రకారం.. అమెరికన్ పెద్దలలో 20% మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇది యాంగ్జైటీ వల్ల కలిగే నిద్ర సమస్య. యాంగ్జైటీ, నిద్ర రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. మీకు యాంగ్జైటీగా ఉంటే అది మీ నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే మీరు సరైన సమయానికి నిద్రపోకపోతే ఆందోళనను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆక్స్ఫర్డ్ అకాడమిక్ ప్రచురించిన ఒక జర్నల్ ప్రకారం.. ఎక్కువ మృదువైన దుప్పటి, టెడ్డీబేర్, మృదువైన దిండును పట్టుకోవడం వల్ల చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. అలాగే హాయిగా పడుకుంటారు. అయితే మీరు నిద్రలేమితో బాధపడుతుంటే ఇలా చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
పరిశోధన ప్రకారం.. మెత్తని టెడ్డీ బేర్లను కౌగిలించుకుని నిద్రపోవడం సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇది ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది. అలాగే మీ శరీరం, మనస్సును రిలాక్స్ చేస్తుంది. అలాగే ఇది నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.
ఆక్స్ ఫర్డ్ అకడమిక్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. మార్కెట్ లో లభించే మృదువైన టెడ్డీ బేర్ లు పిల్లలకు ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా పెద్దల మానసిక ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. దీనివల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటంటే..
ఒంటరిగా అనిపించదు
రాత్రిపూట మీరు ఒంటరిగా నిద్రపోయినా, లేదా ఉద్యోగం కోసం లేదా చాలా కాలం పాటు చదువు కోసం ఇంటికి దూరంగా ఉంటున్న వారు టెడ్డీ బేర్ ను హగ్ చేసుకుని పడుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇది మీకు మీరు ఒంటరిగా లేరు అన్న భావనను కలిగిస్తుంది. మెత్తని టెడ్డీబేర్, దిండు లేదా మరేదైనా మృదువైన బొమ్మను కౌగిలించుకొని నిద్రపోయే అలవాటు మీ ఒంటరితనం అనుభూతిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
ఓదార్పు భావాన్నిస్తుంది
రాత్రి పడుకునేటప్పుడు సౌకర్యంగా అనిపించకపోతే అది మన నిద్ర నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అందుకే నిద్రపోవడానికి సౌకర్యవంతమైన మంచం, వాతావరణం ఉండేలా చూసుకోవాలి. రాత్రిపూట ఏదైనా మృదువైన టెడ్డీబేర్ ను కౌగిలించుకుని నిద్రపోతే అది మీకు ఓదార్పు అనుభూతిని ఇస్తుంది. అలాగే మీ నిద్ర నాణ్యతను పెంచుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
Image: Getty Images
ఆక్సిటోసిన్ ను విడుదల చేస్తుంది
మెత్తని, మృదువైన టెడ్డీబేర్ లేదా దిండును కౌగిలించుకుని పడుకున్నప్పుడు మన శరీరంలో ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఆక్సిటోసిన్ అనేది ఒక హార్మోన్. ఇది మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే మంచి అనుభూతిని కలిగించడానికి సహాయపడుతుంది.
శారీరక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది
మృదువైన బొమ్మను కౌగిలించుకుని పడుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుండటమే కాదు శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. మనం సరిగ్గా నిద్రపోగలిగినప్పుడు మన శరీరంలో వైద్యం ప్రక్రియ పెరుగుతుంది. దీంతో అన్ని శారీరక సమస్యలు తొందరగా తగ్గిపోతాయి.