- Home
- Life
- Health
- ఉదయం పరిగడుపున రన్నింగ్ చేస్తే కొవ్వు కరగడమే కాదు.. ఆ సమస్యలు కూడా తగ్గిపోతాయి తెలుసా?
ఉదయం పరిగడుపున రన్నింగ్ చేస్తే కొవ్వు కరగడమే కాదు.. ఆ సమస్యలు కూడా తగ్గిపోతాయి తెలుసా?
ఉదయం లేచిన వెంటనే వ్యాయామం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. కానీ మీకు జిమ్ కు వెళ్లడం ఇష్టం లేకపోతే పరిగడుపున కాసేపు రన్నింగ్ అయినా చేయండి. దీనివల్ల ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి.

ఏరోబిక్ వ్యాయామం చేయడానికి రన్నింగ్ ఉత్తమ మార్గం. ఇది ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంతో పాటుగా ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. క్రమం తప్పకుండా రన్నింగ్ చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. వ్యాయామాల విషయానికి వస్తే.. ఖాళీ కడుపుతో రన్నింగ్ చేయడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి ఏడెనిమిది గంటల పాటు ఏమీ తినకుండా ఉండటం ఉదయాన్నే లేచి రన్నింగ్ కు వెళ్లడం మంచి అలవాటని నిపుణులు అంటున్నారు. దీనిని ఫాస్ట్ ట్రైనింగ్ లేదా ఫాస్ట్ రన్నింగ్ అని కూడా అంటారు. ఇది బరువు తగ్గడం, కొవ్వు బర్న్ తో పాటుగా ఎన్నో ఇతర ప్రయోజనాలను కలిగిస్తుంది.
ఉదయం పరుగెత్తే ముందు మీరు ఏమీ తిననప్పుడు మీ శరీరంలో గ్లైకోజెన్ కార్బోహైడ్రేట్ల నిల్వ ఉంటుంది. దీని కారణంగా శరీరం దీనిని ఒక ప్రధాన శక్తి వనరుగా ఉపయోగిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో పరిగెత్తడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కొవ్వును కరిగిస్తుంది
ఉదయాన్నే పరగడుపున పరిగెత్తడం వల్ల ఫాస్ట్ రన్నింగ్ ఫ్యాట్ బర్నింగ్ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరం ఎక్కువ కొవ్వును శక్తిగా ఉపయోగిస్తుంది. దీని వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది లేదా ఆక్సీకరణం చెందుతుంది. పది మంది పురుషులపై 2015 అధ్యయనంలో.. బ్రేక్ ఫాస్ట్ కు ముందు వ్యాయామాలు చేసినప్పుడు ఆక్సిజన్ స్థాయిలు పెరిగాయి.
<p>running</p>
శక్తి వృధా కాదు
ఉదయాన్నే పరగడుపున పరిగెత్తితే ఎనర్జీ వృథా అవ్వదని నిపుణులు చెబుతున్నారు. దీంతో మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. 2019లో 12 మంది రన్నర్లపై పరిశోధనలు చేశారు. ఇందులో ఖాళీ కడుపుతో పరిగెత్తడం వల్ల శక్తి వృథా కాదని వెల్లడైంది. దీనివల్ల మీకు 24 గంటలకు సరిపడా శక్తి లభిస్తుంది. రక్తం, కండరాల గ్లైకోజెన్ స్థాయిలు పడిపోయినప్పుడు కాలేయం గ్లైకోజెన్ ను శరీరంలోకి ట్యాప్ చేస్తుంది.
జీర్ణ సమస్య తగ్గుతుంది
ఉదయాన్నే పరగడుపున పరిగెత్తడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కడుపు తిమ్మిరి, వాంతులు, వికారం, విరేచనాల సమస్యలు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరంలో స్టామినాను పెంచుతుంది.
పరిగడుపున పరిగెత్తడం వల్ల కలిగే నష్టాలు
అలసట
మీకు తక్కువ శక్తి స్థాయిలు ఉంట.. ఖాళీ కడుపుతో పరిగెత్తడం మీకు మంచిది కాదు. ఎందుకంటే వ్యాయామం చేసేటప్పుడు మీరు మరింత అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇది గాయం ప్రమాదాన్ని పెంచుతుంది. మెదడు సరిగా పనిచేయడానికి గ్లూకోజ్ అవసరం. శరీరం గ్లూకోజ్ ద్వారా కండరాలకు ఇంధనం ఇవ్వడానికి పనిచేస్తుంది. ఇలాంటప్పుడు మీరు పరిగెత్తేటప్పుడు గ్లూకోజ్ తాగండి. అలాగే పరిగెత్తండి.
కండరాలకు నష్టం
కార్టిసాల్ అనే హార్మోన్ శరీరంలో అడ్రినల్ గ్రంథులను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర, ఒత్తిడిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో ప్రోటీన్ విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుంది. ఇది కండరాల నష్టం, బలహీనతకు దారితీస్తుంది. ఇలా ఎక్కువగా ఉదయం పూట జరుగుతుంది. రాత్రిపూట ఉపవాసం తర్వాత ఉదయం దాని స్థాయి పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఖాళీ కడుపుతో పరిగెత్తడం ఆరోగ్యానికి మంచిది కాదు.