రోజుకి ఎన్ని గంటలు నిలపడాలి...?
అసలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా, ఆరోగ్యంగా ఉండాలి అంటే... రోజులో ఎన్ని గంటలు నిలపడాలి..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...
ఈ రోజుల్లో దాదాపు అందరివీ కూర్చొని చేసే ఉద్యోగాలే. ఇలా రోజులకు రోజులు, గంటల కొద్దీ కూర్చొని పని చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఒబేసిటీ సమస్య, టైప్ 2 డయాబెటిక్స్, గుండె సంబంధిత సమస్యలు చాలా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎంత కూర్చొని చేసే పని అయినా... కాసేపు అయినా నిలపడాలని... కనీసం అరగంటకు ఒకసారి అయినా లేచి నిలపడాలి. ఐదు నిమిషాల పాటు నడవాలి. లేకుంటే మనకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. లేదు.. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజులో నిలపడటానికి కూడా కొంత సమయం కేటాయించాలి.
అసలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా, ఆరోగ్యంగా ఉండాలి అంటే... రోజులో ఎన్ని గంటలు నిలపడాలి..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...
standing-desk
రోజుకి ఎన్ని గంటలు నిలపడాలి అనేది అందరికీ ఒకే సమాధానం ఉండదు. ఒక్కొక్కరి వయసు, వారి ఆరోగ్య సమస్యలను బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే.. పర్టిక్యులర్ గా ఇన్ని గంటలు నిలపడాలి అని చెప్పలేం. కానీ... ఎక్కడ కూర్చున్నా... ఏ పని చేస్తున్నా... ప్రతి 30 నిమిషాలకు ఒకసారి, గంటకు ఒకసారి లేచి నిలపడాలి. కనీసం ఐదు నిమిషాలు అయినా అటు, ఇటు నడవాలి.
కొందరు.. నిలపడితే మంచిది అన్నారు కదా అని... గంటలు గంటలు కూడా నిలపడకూడదు. దాని వల్ల కూడా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి... కూర్చోవడం అయినా, నిలపడటం అయినా ఏది ఎక్కువ సేపు చేయకూడదు. దేనికైనా కాస్త కంట్రోల్ ఉండాలి. మితంగా చేయాలి.
ఓ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే...ఒక రోజులో ఫిజికల్ గా యాక్టివ్ గా 4 గంటలు ఉండాలి. 8 గంటలు కనీసం నిద్రపోవాలి. నాలుగు గంటలు కూర్చోవాలి, ఐదు గంటలు నిలపడాలి. ఈ క్రమంలో ప్లాన్ చేసుకుంటే బెటర్. అలా అని అవి కూడా కంటిన్యూస్ గా చేయకపోవడమే మంచిది.