- Home
- Life
- Health
- Health Tips: థైరాయిడ్ సమస్య కంటికి కూడా ప్రమాదమే.. అశ్రద్ధ చేస్తే పరిస్థితి మరింత తీవ్రం!
Health Tips: థైరాయిడ్ సమస్య కంటికి కూడా ప్రమాదమే.. అశ్రద్ధ చేస్తే పరిస్థితి మరింత తీవ్రం!
Health Tips: థైరాయిడ్ లో చాలా రకాలు ఉంటాయి. వీటిలో కొన్ని థైరాయిడ్లు కళ్ళకి కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. దీనివల్ల కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి దాని మంచి చెడ్డల గురించి తెలుసుకుందాం.

థైరాయిడ్ ఒక దీర్ఘకాలిక సమస్య భారత దేశంలోని ప్రతి మందిలో ఒకరి కన్నా ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గొంతు ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంధి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవం మీద పడుతుంది.
ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే హైపో థైరాయిడ్, ఉత్పత్తి పెరిగితే హైపర్ థైరాయిడ్ అని అంటారు. ఈ థైరాయిడ్ సమస్యలు ఎక్కువైనప్పుడు అవి కంటి సంబంధిత సమస్యలకు కూడా దారి తీయవచ్చు. పరిస్థితి చేయి దాటి దృష్టిని కోల్పోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ పరిస్థితిని థైరాయిడ్ సంబంధిత ఆర్బిటోపతి అంటారు.
దీని లక్షణాలు గురించి దీని చికిత్స గురించి తెలుసుకుందాం. సూక్ష్మజీవులు మరియు ఇతర కాలుష్య కారకాల నుండి మనలను రక్షించే రోగ నిరోధక వ్యవస్థ కళ్ళు మరియు చుట్టుపక్కల సరైన కణజాలాలను బాహ్య ఆక్రమణదారుగా తప్పుగా చూపించినప్పుడు ఈ కంటి సమస్యలు సంభవిస్తాయి.
అటువంటప్పుడు కళ్ళలోని తెలసన ఎర్రబారటం, కంటికి చికాకు కలగటం, కంటి నొప్పి మరియు ఒత్తిడి, కళ్ళు పొడిబారడం లేదా తడి బారడం కాంతి సున్నితత్వం, ద్వంద్వ దృష్టి వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే సాధారణ థైరాయిడ్ స్థాయి ఉన్నవారిలో ఈ వ్యాధి చాలా అరుదు.
హైపర్ థైరాయిడ్ ఉన్నవాళ్లు ఎక్కువగా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. దీనికోసం కంటి పరీక్షలు చేయించుకోండి. సాధారణ చికిత్స ద్వారా ఈ సమస్యని నివారించవచ్చు చాలా కొద్ది మందిలో మాత్రమే సస్తరి చికిత్స అవసరం అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో ప్రమాదం ఎక్కువ కాకుండా చూసుకోవటం మన బాధ్యత.
కాబట్టి తరచుగా చేతులని శానిటైజేషన్తో కడుక్కోండి ఈ వ్యాధి సోకిన వ్యక్తులకు దూరంగా ఉండండి. శుభ్రం చేసుకోకుండా ఆ చేతులతో కళ్ళని రుద్దకండి. రోజువారి ఆహారంలో ఆకుకూరలు పండ్లు ఉండేలాగా చూసుకోండి.