- Home
- Life
- Health
- Health Tips: ఎంత ప్రయత్నించినా చెవి నొప్పి తగ్గటం లేదా.. అయితే వెల్లుల్లితో ఇలా చేయండి?
Health Tips: ఎంత ప్రయత్నించినా చెవి నొప్పి తగ్గటం లేదా.. అయితే వెల్లుల్లితో ఇలా చేయండి?
Health Tips: చాలా సందర్భాలలో చెవిలో నొప్పి విపరీతమైన వాపు కారణంగా వస్తుంది. అలాగే జలుబు మరియు చెవి నుంచి ద్రవాలు కారటం వల్ల కూడా చెవి నొప్పి వస్తుంది. అయితే ఈ నొప్పిని తగ్గించడానికి వెల్లుల్లి బాగా పనిచేస్తుందట. అదెలాగో చూద్దాం.

సాధారణంగా చెవి నొప్పి వస్తే ఆ బాధ భరించలేనిదిగా ఉంటుంది. అయితే దీనికి వెల్లుల్లి మంచి సహజ ఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో ఉండే బలమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ తో పోరాడటం ద్వారా చెవి నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు.
ఇది యాంటీ ఇంప్లమెంటరీ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. దీనివలన ద్రవాల పారుదలని నిరోధించే చెవి లో ఉండే మలినాలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. చెవి నొప్పి చికిత్స కోసం భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుంచి వాడుతున్న ఔషధం వెల్లుల్లి నూనె.
ఇది ఇప్పటికీ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఉపయోగించబడుతుంది. ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొబ్బరి నూనె లో వేసి నూనె ఎర్రగా అయ్యేవరకు వేడి చేయాలి. ఇప్పుడు కొద్దిగా చల్లబడిన తర్వాత చెవి నొప్పిని వదిలించుకోవడానికి..
ఈ నూనెను ఒకటి రెండు చుక్కలు చెవిలో వేయండి. అలాగే మరొక పద్ధతిలో ఒక రోకలితో ఒక వెల్లుల్లి రెబ్బన్ని చూర్ణం చేయండి. ఆ చూర్ణాన్ని ఒక కాటన్ లో చుట్టండి. ఏ చెవి అయితే నొప్పి పెడుతుందో ఆ చెవిలో ఈ కాటన్ బాల్ ని మెల్లగా చొప్పించండి.
మరీ లోతుగా వెళ్లకుండా చూసుకోండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ చూర్ణం రసం చెవి లోపలికి వెళ్ళింది అని మీకు అనిపించిన వెంటనే ఆ కాటన్ బాల్ ని తీసేయండి. ఇలా చేయటం వలన చెవి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చును.
అలాగే ఒక వస్త్రంలో దంచిన వెల్లుల్లి రెబ్బలు మూడు, చిటికెడు ఉప్పు వేసి నొప్పిగా ఉన్న చెవి మీద ఉంచండి. ఇలా చేయడం వలన చెవి పోటు, చెవి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఇవి తాత్కాలికమైన చెవి నొప్పులకి మాత్రమే. నొప్పి తీవ్రతను బట్టి మీరు వైద్యుడిని సంప్రదించడం మంచిది.