- Home
- Life
- Health
- Health Tips: స్థూలకాయంతో బాధపడుతున్నారా.. కొంచెం శ్రద్ధ వహిస్తే ఆరోగ్యం మీ చేతుల్లోనే?
Health Tips: స్థూలకాయంతో బాధపడుతున్నారా.. కొంచెం శ్రద్ధ వహిస్తే ఆరోగ్యం మీ చేతుల్లోనే?
Health Tips: స్థూలకాయం కూడా ఒక ప్రమాదకరమైన వ్యాధి వంటిదే. అందుకే స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి కొంచెం శ్రద్ధ వహించి ఈ చిట్కాలు పాటించండి.

స్థూల కాయం అనుకున్నంత చిన్న సమస్య ఏమి కాదు. ఒక పరిధిని దాటితే అది గుండెపోటు కి దారి తీయవచ్చు. అందుకని జాగ్రత్త వహించండి బరువుని అదుపులో పెట్టుకోండి అందుకోసం చిన్నచిన్న వ్యాయామాలు ప్రారంభించండి. ముందుగా ఒక ప్రణాళిక వేసుకోండి.
దాని ప్రకారమే ఆహారం తీసుకోవటం అయినా వ్యాయామం చేయడం అయినా రోజువారీగా చేయండి. చాలామంది ఉత్సాహంతో తక్కువ రోజుల్లో బరువు తగ్గడం కోసం ఆరంభ సూరత్వంగా చాలా హెవీ వర్కౌట్లు చేస్తూ తర్వాత పూర్తిగా మానేస్తూ ఉంటారు కానీ అది ఆరోగ్యానికి మరింత ప్రమాదం అని గుర్తించండి.
అలాగే బరువు తగ్గడం కోసం పూర్తిగా భోజనం మానేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. కొంచెం కొంచెంగా భోజనం తగ్గిస్తూ వాటి స్థానంలో పండ్లను తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిది. అలాగే ఆహారంలో స్పీచ్ పదార్థాలని తీసుకోవడం వలన తక్కువ భోజనంతోనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.
అలాగే వ్యాయామం చేసేటప్పుడు గుండె వేగాన్ని కూడా లెక్కించాలి వ్యాయామం వల్ల కలిగే ఫలితాలని మన శరీరం పొందాలంటే వ్యాయామంలో ఒకే వేగం పాటించడం అవసరం ఈ వేగం ద్వారా మన గుండె వేగాన్ని కూడా 135 నుంచి 150 స్పందనలకు పెంచాలి.
ఈ హార్ట్ బీట్ ని కనీసం 40 నిమిషాల సేపు కొనసాగినివ్వాలి. అలాగే చేసే ప్రతి వ్యాయామం కూడా ఇంట్రెస్ట్ తో ఎంజాయ్ చేస్తూ చేయాలి ముందుగా చిన్న చిన్న ఎక్సర్సైజులతో ప్రారంభించి క్రమంగా కఠినమైన ఎక్సర్సైజులు చేయడం ద్వారా స్థూలకాయాన్ని తగ్గించుకుంటూ రావచ్చు.
ఇలా మీ శరీరం మీరు అనుకున్న రూపానికి రావడానికి చాలా సమయం పడుతుంది అందుకు సహనాన్ని ప్రదర్శించండి. ఒకసారి మీ బాడీ షేప్ లోకి వచ్చిందంటే ఆనంద పడిపోయి మళ్లీ మీ రెగ్యులర్ లైఫ్ లోకి వెళ్ళిపోకండి. అది మరింత ప్రమాదం. కాబట్టి కొంచెం శ్రద్ధ తీసుకొని మీ ఎక్సైజ్ లని కంటిన్యూ చేస్తూ మంచి ఆహారం తీసుకుంటూ స్థూలకాయాన్ని తగ్గించుకోండి.