Beauty Tips: గోర్ల మీద కూడా కాస్త దృష్టి పెట్టండి.. మెరుస్తూ ఉండాలంటే ఇలా చేయండి?
Beauty Tips: పాదాలు వాటి గోర్లు కూడా మన శరీరంలో భాగమే కొంచెం శ్రద్ధ తీసుకుంటే అవి కూడా మన శరీరానికి అదనపు అందాన్ని తీసుకువస్తాయి. అదెలాగో తెలుసుకుందాం.

చాలామంది ముఖం మాత్రమే అందంగా ఉంటే చాలు అనుకుంటారు కానీ పాదాల మీద వాటి గోర్లు మీద దృష్టి పెట్టరు. కానీ పాదాలు గోళ్లు అందంగా ఉంటే అది మనకి మరింత అదనకు ఆకర్షణ ని తీసుకువస్తాయి. అప్పుడప్పుడు వాటిని కూడా పరిశీలిస్తూ ఉండాలి. గోర్ల రంగు మన ఆరోగ్యాన్ని సూచిస్తుందని ఎంతమందికి తెలుసు..
గోర్లు పాలిపోయి ఉంటే రక్తహీనత ఉన్నట్లుగా గుర్తించండి. గోళ్ళ ఎదుగుదల తక్కువగా ఉండి పసుపచ్చ రంగులో మందంగా ఉంటే మూత్రపిండాల ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదో అని గమనించండి గోళ్ళపై తెల్లటి ప్యాచెస్ ఉంటే కాల్షియం లోపం ఉన్నట్లు.
గోర్లు మందంగా మారిపోవటం, విరిగిపోవడం వంటి వాటికి ఇన్ఫెక్షన్లు కారణమని గుర్తించండి. కాబట్టి పాదాలకి గోర్లకి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోండి. ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధాన కారణం ఎక్కువసేపు పాదాలు నీటిలో నానటం.
తడి గా ఉండగానే మేజోళ్ళు వేసుకోవటం, పాదాలకి సరైన గాలి వెళ్తురు తగలకపోవడం వంటి వాటి వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి కాబట్టి వాటి విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. కాలి గోళ్లని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. వాటిని ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఒక షేపులో ఉంచుకోవడం వల్ల అందంగా కనిపిస్తాయి.
నెయిల్ పాలిష్ వేసేటప్పుడు హానికరమైన కెమికల్స్ ఉండే నైల్ పోలిష్ వాడటం వల్ల గోళ్ళ మెరుపు తగ్గిపోతుంది కాబట్టి జాగ్రత్త వహించండి. మీరు గోళ్ళను కత్తిరించినప్పుడు గోరుచుట్టు సహజంగా ఉండే వంపుననుసరిస్తే చాలా సహజంగా అందంగా కనిపిస్తాయి.
గోళ్ళ కోసం బ్రష్ ని వాడండి ఇది చాలా సులువైనది సున్నితంగా మృత కణాలని మురికిని మీ గోళ్ళ నుంచి తొలగించడంలో ఇది మీకు తోడ్పడుతుంది. అలాగే ఎప్పటికప్పుడు పాదాలకి పగుళ్లు లేకుండా తగిన చర్యలు తీసుకోండి