వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నరా? ఇదిగో ఈ చిట్కాలతో తొందరగా తగ్గించుకోండి
సీజన్ మారుతుంటే వైరల్ ఫీవర్లు వస్తుంటాయి. ఇవి సర్వ సాధారణం. ముఖ్యంగా వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ ఫాస్ట్ గా పెరుగుతుంది. దీంతో దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యల బారిన పడుతుంటారు. అయితే కొన్ని ఎఫెక్టీవ్ చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
సీజన్ మారితే ఎన్నో రోగాల బారిన పడుతుంటాం. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. ఎండలో ఉండటం, వానలు పడ్డప్పుడు, చల్లగాలులు వీచినప్పుడు వైరల్ ఫీవర్లు వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వర్షం కారణంగా చాలా చోట్ల నీరు నిలిచిపోతుంది. దీంట్లో ఎన్నో రకాల దోమలు, బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. ఈ దోమలు కుట్టడం, ఇన్ఫెక్షన్ల వల్ల మనం ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తది.
ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణం కూడా మన శరీరంపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఇక మన శరీర ఉష్ణోగ్రత కూడా వాతావరణాన్ని బట్టి తరచుగా మారుతుంటుంది. ఆ తర్వాత మనం జబ్బుల బారిన పడతాం. అందుకే వర్షాకాలంలో చాలా మంది వైరల్ ఫీవర్ల బారిన ఎక్కువగా పడుతుంటారు. ఈ సీజనల్ ఫ్లూ సమస్య కూడాఎక్కువగా ఉంటుంది.
viral fever
వైరల్ ఫీవర్ అంటే ఏమిటి?
వైరల్ ఫీవర్ అంటే శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్. మారుతున్న వాతావరణం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది. అలాగే చర్మ దద్దుర్లు, తలనొప్పి, ఒంటి నొప్పులు వంటి సమస్యలు వస్తాయి.
వైరల్ జ్వరాన్ని నివారించే చిట్కాలు
వైరల్ ఫీవర్ ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారికే ఎక్కువగా, తొందరగా వస్తుంది. పిల్లలకు, వృద్ధులకు ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలో ఈ వైరల్ ఫీవర్ ను దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పుష్కలంగా ద్రవాలు తాగాలి
మన శరీరానికి నీరు చాలా చాల అవసరం. మన శరీరం ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంటే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. అయితే వర్షాకాలంలో చాలా మంది నీళ్లను, ఇతర హెల్తీ డ్రింక్స్ ను చాలా తక్కువగా తాగుతుంటారు. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీనివల్ల మీరు ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తది. అందుకే సీజన్ ఏదైనా సరే ద్రవాలను పుష్కలంగా తాగండి. నీటితో పాటుగా, కొబ్బరి నీళ్లు, ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలను తాగండి.
ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలి
వైరల్ ఫీవర్ వాతావరణంలో వచ్చి మార్పు లేదా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అందుకే మీ ఇంటిని, ఇంటి చుట్టుముట్టూ క్లీన్ గా ఉంచుకోవాలి. మీరు తాగే నీటిపై మూతలు పెట్టాలి. దోమలు వాలకుండా జాగ్రత్త పడాలి. దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగీ వ్యాధులు వస్తాయి.
Samosa
బయటి వస్తువులు తినడం మానుకోండి
వర్షాకాలంలో బయటివస్తువులను తినడం ఏ మాత్రం సేఫ్ కాదు. ఎందుకంటే దీనివల్ల ఎన్నో రోగాలు వస్తాయి. ఎందుకంటే మార్కెట్లో తయారైన వస్తువులు అపరిశుభ్రంగా ఉంటాయి.
Image: Getty
మాస్క్ ను ఉపయోగించండి
బయటకు వెళ్లినప్పుడు, రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ను వాడండి. కరోనా మహమ్మారి నుంచి మనం ఎంతో నేర్చుకున్నాం. అంటే ఏ వ్యాధి అయినా సరే తగ్గించుకోవడం అంత తేలిక కాదు.
తులసి, దాల్చిన చెక్క నీళ్లు
దాల్చిన చెక్క, తులసి లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇలాంటి వాటిని నీటిలో మరిగించి ఉదయాన్నే పరగడుపున తాగితే ఎంతో మంచిది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
సెలెరీ నీరు
సెలెరీ ఒక మసాలా దినుసు. ఇది కూడా మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. సెలెరీ వాటర్ వైరల్ ఫీవర్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని నీటిలో మరిగించి తాగితే వైరల్ ఫీవర్ నుంచి తొందరగా బయటపడతారు.