నోటి పూత వల్ల భరించలేని నొప్పి వస్తోందా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..
ఇది బుగ్గలు, పెదవులు, నాలుక కింది భాగంలో అవుతుంది. నోటిపూతను శాస్త్రీయంగా అఫ్తస్ అల్సర్ అంటారు. ఇది సాధారణంగా ప్రమాదకరం కానప్పటికీ.. దీనివల్ల భరించలేని నొప్పి కలుగుతుంది.

mouth ulcers
నోటి పూతలు చాలా సాధారణ ఆరోగ్య సమస్య. నోటి పూతలు వివిధ కారణాల వల్ల అవుతాయి. నోటి లోపలి భాగాన్ని అనుకోకుండా కొరకడం, విటమిన్లు లేకపోవడం, రోగనిరోధక శక్తి లేకపోవడం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటివి నోటి పూతలకు ప్రధాన కారణాలు.
సాధారణంగా ఇది బుగ్గలు, పెదవులు, నాలుక క్రింది భాగం వంటి కొన్ని భాగాలలో అవుతుంది. దీనిని శాస్త్రీయంగా అఫ్తస్ అల్సర్ అంటారు. సాధారణంగా ఇది ప్రమాదకరం కానప్పటికీ దీని వల్ల భరించలేని నొప్పి కలుగుతుంది. ఇది తినడం, నీరు తాగడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. అంతేకాదు ఈ నొప్పి ఎక్కువైనప్పుడు మాట్లాడటంలో ఇబ్బందికూడా కలుగుతుంది. నోటిపూత సాధారణంగా గుండ్రంగా, తెలుపు, గోధుమ, పసుపు రంగులో ఉంటుంది. అలాగే వాటి చివర్లన ఎరుపు రంగు ఉంటుంది.
అయితే దీనికి కొన్ని సింపుల్ చిట్కాలతో తగ్గించుకోవచ్చు. మీరు ఇంట్లో చేయగలిగే వాటిలో ఒకటి ఉప్పు నీరు ఒకటి. అలాగే మీ ఆహారంలో వీలైనంత వరకు పెరుగును చేర్చండి. ఎందుకంటే పెరుగు మంచి బ్యాక్టీరియా ఉన్న ఆహారం. పెరుగు శరీరంలో మంట, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే విటమిన్ బి 12, జింక్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినండి. మీ నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. కొన్ని టూత్ పేస్ట్ లు నోటి పూతలకు కారణమవుతాయి. ఇంట్లో నోటిపూతను తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
basil
తులసి
తులసిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్న తులసి ఆకులను నమలడం వల్ల నోటి పూతల నుంచి బయటపడతారు.
తేనె
తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి పూతలకు కూడా అద్భుతమైన ఔషధం. కాబట్టి మీరు ప్రతిరోజూ నోటి పూత పైన కొద్దిగా తేనెను అప్లై చేయండి.
గోరువెచ్చని నీరు
నోటిలో పుండ్లు ఉన్నవారు ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో నోటిని తరచుగా కడుక్కోవాలి.
మెంతిఆకులు
మెంతి ఆకులు నోటి పూతల నుంచి బయటపడటానికి ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం ఒక కప్పు నీళ్లను తీసుకుని బాగా మరిగించి.. అందులో కడిగిన మెంతి ఆకులను వేసి 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత దానితో నోరు కడుక్కోవడం వల్ల నోటి పూతల నుంచి బయటపడతారు.
పసుపు
పసుపులో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అయితే కొద్దిగా పసుపును తీసుకుని అందులో కొన్ని చుక్కల నీరు పోసి పేస్ట్ గా చేసి నోటిపూతల మీద రాయండి.
కలబంద రసం
కలబంద రసాన్ని రోజుకు రెండుసార్లు నోటి పూతల పై అప్లై చేయడం వల్ల నోటి పూత వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.
ఆరెంజ్ జ్యూస్
శరీరంలో విటమిన్ సి లోపం ఉన్నవారికి ఇతరులకన్నా నోటి పూతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆరెంజ్ జ్యూస్ ను రోజూ తాగడం వల్ల నోటి పూతల నుంచి బయటపడతారు.