Beauty Tips: తలలో చుండ్రు సమస్యతో కంగారు పడకండి.. ఈ చిట్కాలు పాటించండి?
Beauty Tips: కాలుష్యం మన ఆరోగ్యం మీదే కాదు దాని ప్రభావం మన జుట్టు మీద కూడా పడుతుంది. ఇది చుండ్రు వంటి సమస్యలకి దారితీస్తుంది. అయితే చిన్నచిన్న చిట్కాలతో సమస్య నుంచి బయటపడటం ఎలాగో చూద్దాం.

ప్రస్తుత పరిస్థితులలో ఇల్లు దాటి అడుగు బయట పెట్టామంటే మొదట మనం గురయ్యేది కాలుష్యానికే. దీనివల్ల మన చర్మం ఎంత పాడవుతుందో అంతకన్నా ఎక్కువగానే మన జుట్టు కూడా పాడవుతుంది. దీని వలన చుండ్రు దురద లాంటి సమస్యలు మొదలవుతాయి.
అయితే వీటికి కేవలం కాలుష్యం మాత్రమే కారణం కాదు. జుట్టుని శుభ్రంగా ఉంచకపోయినా.. తడి ఆరకుండా జడ వేసుకోవడం వల్ల.. వర్షాకాలం శీతాకాలంలో పొడిగాలి, తక్కువ తేమ కూడా చుండ్రుకి కారణం అవుతుంది. ఈ సమస్యని ఇలాగే వదిలేస్తే మరింత తీవ్రతరం అవుతుంది.
చుండ్రు సమస్య అధికంగా ఉంటే స్కాల్ప్ పొడిగా మారకుండా తలపై చర్మం నిర్జీవంగా పొరలపర్లుగా మారకుండా ప్రత్యేక సమస్యలు తీసుకోవాలి. చుండ్రు నిరోధక నూనెతో ప్రశాంతంగా తలపై మసాజ్ చేయటం కూడా చాలా మంచిది. జుట్టును ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి తాజా పండ్లు కూరగాయలను తినడం ద్వారా అంతర్గతంగా పోషణ లభించి చుండ్రు పొడి స్కాల్పును నివారించవచ్చు.
చుండ్రు సమస్య ఉన్నప్పుడు రసాయనాలను కలిగియున్న కఠినమైన షాంపూలకు బదులు ఆయుర్వేద మూలికలతో రూపొందించిన సున్నితమైన షాంపూని ఎంచుకోవాలి. సహజమైన చుండ్రు నివారణ మూలికలైన అనంతము, తులసి, వేప, మంజిష్ఠ వంటి..
ఇంగ్రిడియంట్స్ కలిగిన షాంపూ ని ఎంచుకుంటే జుత్తికి చాలా మంచిది. అలాగే తల స్నానం చేసేటప్పుడు వేడి నీటితో తలస్నానం చేయకూడదు. బ్లో డ్రైయింగ్ ద్వారా తల ఆరబెట్టుకోవటం కూడా మంచి పద్ధతి కాదు. చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు నూనె రాసుకోవద్దు. ఎందుకంటే నూ నెలలో సంతృప్తి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
వీటిలో చుండ్రుకు కారణమయ్యే ఈస్ట్ తింటుంది అందువల్ల దురదగా ఉన్న తలపై నూనె రాయటం వల్ల చుండ్రు ఇంకా పెరుగుతుంది. అలాగే మన శరీరం చెమట పట్టినప్పుడు తల కూడా ఖచ్చితంగా చమటపడుతుంది అప్పుడు తలని శుభ్రం చేసుకోవడం చాలా ఉత్తమం.