మీ స్టామినాను పెంచే సూపర్ ఫుడ్స్..
కొన్ని సార్లు కంటినిండా నిద్రపోయినా.. ఉదయం మేల్కోగానే నీరసంగా, ఒంట్లో శక్తి లేనట్టుగా అనిపిస్తుంది. అయితే కొన్ని ఆహారాలు మనల్ని రోజంగా ఎనర్జిటిగ్ గా ఉంచడానికి, మన స్టామినాను పెంచడానికి ఎంతో ఎంతో సహాయపడతాయి.

కొన్నిసార్లు, మనం నిద్రపోయిన తర్వాత లేదా ఎక్కువసేపు నిద్రపోయిన తర్వాత లేచినవెంటనే అలసటగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఉదయం నిద్రలేచిన తర్వాత మనం కోరుకున్నంత తాజాగా అనిపించదు. చాలా మంది ఉదయం లేచిన తర్వాత అలసటగా ఉంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో తక్షణ శక్తి కావాలనిపిస్తుంది. అయితే మనం రోజంతా శక్తివంతంగా, ఎనర్జిటిక్ గా ఉండటానికి, మన స్టామినాను పెంచడానికి కొన్ని ఆహారాలు బాగా సహాయపడతాయి. అవేంటంటే..
అరటిపండు
అరటిపండు మీ శక్తి స్థాయిలను తిరిగి తెచ్చేందుకు ఎంతో సహాయపడుతుంది. అరటి పండు తక్షణ శక్తిని ఇస్తుంది. అరటిపండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. అరటిపండ్లలో ఫైబర్, విటమిన్ బి 6, పొటాషియంతో సహా ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తింటే మీ ఒంట్లో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అలాగే కండరాల పనితీరు కూడా మెరుగుపడుతుంది.
curd
పెరుగు
పెరుగు లాక్టోస్, గెలాక్టోస్ వంటి సాధారణ చక్కెరలతో తయారవుతుంది. ఇవి విచ్ఛిన్నమైనప్పుడు తక్షణ శక్తిని అందిస్తాయి. పెరుగులోని ప్రోటీన్ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఇది ఎక్కువసేపు శక్తిని కాపాడటానికి సహాయపడుతుంది. అయితే పెరుగులో కొన్ని పండ్లను వేసుకుని తింటే పోషకాలు పెరుగుతాయి. మీ స్టామినా కూడా పెరుగుతుంది.
Image: Getty
చియా విత్తనాలు
చియా విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే రోజుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు. చియా విత్తనాలు మీకు స్థిరమైన శక్తినందిస్తాయి. ఎందుకంటే వీటిలో ప్రోటీన్లు, కొవ్వులు, ఫైబర్ తో పాటుగా తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
ఓట్స్
ఓట్స్ మీకు స్థిరమైన శక్తిని అందిస్తాయి. వీటిలో కరిగే ఫైబర్, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లలో సహా ఎక్కువ మోతాదులో ప్రోటీన్ ఉంటుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చక్కెర శోషణను నెమ్మదింపజేసి మీ శక్తి స్థాయిలను కాపాడుతుంది. మీ స్టామినాను కాపాడుతుంది.
dates
ఖర్జూరాలు
ఖర్జూరాలు చాలా త్వరగా జీర్ణమవుతాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరాల్లో కాల్షియం, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఇనుము పుష్కలంగా ఉంటాయి. అలసటను తగ్గించడానికి, తాజాగా ఉండటానికి ఒక గ్లాసు పాలతో పాటుగా ఖర్జూరాలను తినండి.