- Home
- Life
- Health
- Health Tips: మంచి ఆరోగ్యానికి చక్కనైన ఆహార నియమాలు.. ఇలా చేస్తే ఆరోగ్యం మీ అరచేతుల్లో?
Health Tips: మంచి ఆరోగ్యానికి చక్కనైన ఆహార నియమాలు.. ఇలా చేస్తే ఆరోగ్యం మీ అరచేతుల్లో?
Health Tips: మన ఆరోగ్యం బాగోవాలి అంటే చక్కనైన ఆహార నియమాలు తప్పనిసరిగా ఉండాలి. అందుకే ఆ నియమాలు ఏంటో ఎలా పాటించాలో చూద్దాం రండి.

ఆరోగ్యం అనేది అప్పటికప్పుడు చేరుకునే గమ్యం కాదు. అది నిరంతర సాధన. మనం తినే ఆహారంపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. చక్కనైనఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చూద్దాం రండి. బంగారు పాత్రలో భోజనం చేస్తే సకల దోషాలు పోతాయి.
వెండి పాత్రలో భోజనం చేసేవారికి నేత్రవ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువ. కఫ వాత వ్యాధులు ఉండేవారు మాత్రం వెండి పాత్రలో భోజనం చేయకూడదు. ఇత్తడి పాత్రలో భోజనం చేయడం వలన క్రిములు నశిస్తాయి కఫ వ్యాధులను నివారిస్తాయి.
సోష పాండు రోగములను అరికట్టి శరీరానికి బలాన్ని ఇస్తాయి. పిత్త వ్యాధులు అసలు దరి చేరవు. తామర కాడలు తామర తోడును తామర గడ్డలు చెరుకు మొదలైన వాటిని భోజనానికి ముందే భుజించాలి. భోజనానంతరం అలాంటి వాటిని తినకూడదు. భోజన సమయంలో గట్టి పదార్థాలను ముందు తినాలి.
తర్వాత మృదు పదార్థాలను చివరిలో ద్రవపదార్థాలను తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల బలం చేకూరుతుంది. భోజనం చేసే ప్రతిసారి అన్నంలో అల్లం సైంధవ లవణం కలిపి కొంచెం మోటార్ లో తినటం చాలా మంచిది. ఇలా చేయడం వలన ఆకలి పెరగడమే కాకుండా నాలుకని కంఠాన్ని శుద్ధి చేస్తుంది.
భోజనం చేయడానికి ముందు దానిమ్మ పండు తినవచ్చును భోజనం తర్వాత అరటిపండు, దోస పండు లాంటివి తినాలి. వీటితోపాటు సరియైన వ్యాయామం కూడా శరీరానికి ఆరోగ్యం ఇవ్వటంతో పాటు ఆకలి కలిగే లాగా చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే మనం తినే ఆహారం తాజాగా ఉండేలాగా చూసుకోండి.
వేడిగా ఉండే భోజనం ఆరోగ్యానికి మంచిది. చల్లని పదార్థాలు నిన్న మొన్న మిగిలిపోయిన పదార్థాలు తినడం వల్ల సెట్ ఆరోగ్యం సంగతి పక్కన పెడితే లేనిపోని అనారోగ్యాలు ఎదురవుతాయి. కాబట్టి ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నప్పుడు కాపాడుకోవడం మన బాధ్యత లేదంటే డాక్టర్లకి మన ఆస్తి మొత్తం రాసి ఇవ్వాల్సి ఉంటుంది.