గుండెపోటు సమయంలో ఛాతీలో నొప్పి ఎలా ఉంటుందంటే?
డ్యాన్స్ చేస్తూ, డ్రైవింగ్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ ఇలా ఏదో ఒక సందర్భంలో హఠాత్తుగా చనిపోయిన ఘటనలను మనం రోజూ పేపర్లో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం. అసలు ఈ గుండెపోటు వచ్చే సమయంలో ఛాతిలో నొప్పి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Heart Attack
గుండెపోటుతో మరణించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోందని సర్వేలు వెళ్లడిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. కొరోనరీ హార్ట్ డిసీజ్, సెరెబ్రోవాస్కులర్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్, ఇతర ప్రాణాంతక గుండె సమస్యలను కలిగి ఉన్న హృదయ సంబంధ వ్యాధులు ఏడాదికి సుమారుగా 18 మిలియన్ల మందిని చంపుతున్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య ఇంత ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడమే. చాలా మంది ఈ వ్యాధుల లక్షణాల గురించి తెలుసుకోరు. తెలిసినా పట్టించుకోరు. అలాగే ఈ రోగం ముదిరినంక మాత్రమే హాస్పటల్ కు వెళతారు. అసలు గుండెపోటు సమయంలో ఛాతీ నొప్పి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
heart attack
ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపున అసౌకర్యం
గుండెపోటు సమయంలో ఛాతీలో నొప్పి కలకడం దీని సాధారణ లక్షణాలలో ఒకటి. ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపున తేలికపాటి అసౌకర్యంగా ఉంటుంది. కానీ ఛాతీ ఎడమ వైపు భాగంలో నొప్పి ఉంటే మాత్రం భయపడాల్సిన పనిలేదు. ఛాతీ ఎడమ వైపున వచ్చే నొప్పి గుండెపోటు అని చాలా మంది నమ్ముతారు.
ఛాతీలో బిగుతు
గుండెపోటు వల్ల ఛాతీలో నొప్పి కలగడమే కాకుండా.. ఛాతీ బరువుగా అనిపిపిస్తుంది. దీనివల్ల అకస్మాత్తుగా ఛాతీపై విపరీతమైన ఒత్తిడి కలిగినట్టుగా అనిపిస్తుంది. అలాగే కడుపు టైట్ గా అనిపించడం, తట్టుకోలేని నొప్పి ఆ వ్యక్తిని అసౌకర్యానికి గురిచేస్తాయి. చాలా సందర్భంలో ఛాతీలో మండుతున్న అనుభూతి కూడా కలుగుతుంది.
అవయవాలకు ప్రసరించే నొప్పి
గుండెపోటును గురించి మరొక సంకేతం .. ఒక దగ్గర మొదలైన నొప్పి మరిన్ని అవయవాలకు వ్యాపించడం. గుండెపోటు వల్ల కలిగిన నొప్పి సాధారణంగా ఛాతీలో ప్రారంభమవుతుంది. అలాగే మెడ, వెనుక భాగం, చేతులు, భుజాలకు వ్యాపిస్తుంది. గుండెపోటు సమయంలో దవడల్లో కూడా నొప్పి కలుగుతుంది.
ఛాతీ నొప్పి కొన్ని నిమిషాల పాటే
గుండెపోటు వల్ల వచ్చే నొప్పి కేవలం కొన్ని నిమిషాల పాటు ఉంటుంది. చాలా సందర్భాల్లో.. దానంతట అదే తగ్గిపోయి మళ్లీ వస్తుంది. ఛాతీ ఎడమ వైపున నొప్పి లేదా బరువు పెట్టినట్టుగా అనిపిస్తే మీరు వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి.
ఛాతీ నొప్పి సమయంలో గమనించాల్సిన ఇతర సంకేతాలు
గుండెపోటు సమయంలో.. ఛాతీ నొప్పి అనేక ఇతర సమస్యలతో ముడిపడి ఉంటుంది. వ్యక్తి ఛాతీలో ఒత్తిడి లేదా నలిగిపోతున్న అనుభూతితో పాటు శ్వాస ఆడకపోవడం, చెమట పట్టడం, వికారం లేదా వాంతులు వంటి సంకేతాలను గమనించాలి.
నమ్మకూడని కొన్ని అపోహలు
నేను చాలా చిన్నవాడిని. నాకు గుండెపోటు రానేరాదు.
మా కుటుంబంలో ఎవరికీ గుండెపోటు రాలేదు. కాబట్టి నాకు కూడా రాదు.
ఇలాంటి అపోహలను ఎప్పటికీ నమ్మకండి. ఎందుకంటే ఈ రోజుల్లో యువతకు కూడా హార్ట్ ఎటాక్ వస్తోంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం వంటి అనేక ప్రమాద కారకాలు గుండె సమస్యలను కలిగిస్తాయి. వీలైనంత త్వరగా హాస్పటల్ కు వెళితే మీరు ప్రాణాలను కాపాడుకోవచ్చు.