షుగర్ ఎక్కువున్న డ్రింక్స్ ను తాగే ఆడవారికి ఈ రోగాలొస్తయా?
తీయగా ఉండే పానీయాలను తాగేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సల మంచివి కావు. తాజా అధ్యయనం ప్రకారం.. ఎక్కువ తీయగా ఉండే పానీయాలను తాగే ఆడవారికి..

రోజూ తీయని పానీయాలు తాగడం వల్ల వృద్ధ మహిళల్లో కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. ఒక తాజా అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ చక్కెర పానీయాలను తాగడం వల్ల కాలేయ క్యాన్సర్, దీర్ఘకాలిక కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఇది ముఖ్యంగా వృద్ధ మహిళలకే వచ్చే అవకాశం ఉందని సీఎన్ఎన్ నివేదించింది.
ఈ అధ్యయనం జామా అనే మెడికల్ జర్నల్లో ప్రచురితమైంది. కాగా ఈ అధ్యయనం 50 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సున్న సుమారు 100,000 మంది మహిళలపై జరిగింది. వీరి పానీయ ఎంపికలను ఈ అధ్యయనం ట్రాక్ చేసింది. అలాగే రెండు దశాబ్దాలలో వారి ఆరోగ్య ఫలితాలను కూడా పరిశీలించింది.
అధ్యయనంలో పాల్గొన్న వారి 20 సంవత్సరాల ఫాలో-అప్ నుంచి రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ తీయని పానీయాలు తాగిన మహిళలకు కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం 6.8 శాతం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. వీరిలో 85 శాతం మందికి కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. అలాగే 68 శాతం మంది తీవ్రమైన కాలేయ వ్యాధితో మరణించవచ్చని అధ్యయనం అంచనా వేసింది. రెండు దశాబ్దాల కాలంలో 207 మంది మహిళలకు కాలేయ క్యాన్సర్ వచ్చింది. అలాగే 148 మంది దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో చనిపోయారు.
‘మాకు తెలిసినంత వరకు చక్కెరున్న తియ్యటి పానీయాల వినియోగం, దీర్ఘకాలిక కాలేయ వ్యాధుల నుంచి మరణాల మధ్య సంబంధాన్ని నివేదించిన మొదటి అధ్యయనం ఇది .’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకులలో ఒకరైన లాంగ్గాంగ్ షావో చెప్పారు. ఈ విషయంలో మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు భావిస్తున్నారు.