MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఉప్పును ఎక్కువ తింటే క్యాన్సర్ వస్తుందా?

ఉప్పును ఎక్కువ తింటే క్యాన్సర్ వస్తుందా?

ఉప్పు లేకుండా కూరలను, ఇతర ఫుడ్ ఐటమ్స్ ను అస్సలు తినలేం. ఉప్పే ఆహారాలను టేస్టీగా చేస్తుంది. నిజానికి మన శరీరానికి ఉప్పు కూడా అవసరమే. కానీ మోతాదుకు మించి ఉప్పును తింటే మాత్రం ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తది తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 05 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఉప్పులేని కూరలు, ఆహార పదార్థాలు అసలే ఉండవు. ఎందుకంటే ఉప్పుతోనే వంటల రుచి తెలుస్తుంది. అసలు ఉప్పు లేని వంటలను తినడం సాధ్యమవుతుందా చెప్పండి. ఏదేమైనా ఉప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అది కూడా లిమిట్ లో తిన్నప్పుడే. కానీ మనలో చాలా మంది ఉప్పును మోతాదుకు మించి తినేస్తుంటారు. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఉప్పును తగ్గించాలని హాస్పటల్ కు వెళ్లిన ప్రతిసారి డాక్టర్లు చెప్తూనే ఉంటారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

మీకు తెలుసా? ఉప్పు ఉప్పు క్యాన్సర్ కు కూడా కారణమవుతుందట. రోజూ 10 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఒక జపనీస్ అధ్యయనం వెల్లడించింది. దీనిని మరింత అర్థం చేసుకోవడానికి ఇటీవల ఎలుకలపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం.. కడుపులో ఎక్కువ ఉప్పు ఉండటం వల్ల కడుపు పొర మారుతుంది. అలాగే ఇధి క్యాన్సర్ కు కారణమవుతుంది. దీనిని అనుసరించి జపాన్, చైనా, యునైటెడ్ స్టేట్స్, స్పెయిన్ నుండి వచ్చిన అనేక అధ్యయనాలు ఉప్పు తినడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిర్ధారించాయి.

35

నిజానికి సాధారణ ఆహారంలో 4-6 గ్రాముల ఉప్పును ఉపయోగిస్తారు. ఎందుకంటే ఉప్పును ఎక్కువగా వేయడం వల్ల ఫుడ్ రుచి మారుతుంది. కానీ ఊరగాయలు, సాల్టెడ్ చిప్స్, సాల్టెడ్ వేరుశెనగ, ప్రాసెస్ చేసిన మాంసం వంటి కొన్ని ఆహారాలలో ఉప్పు మోతాదుకు మించి ఎక్కుగా ఉంటుంది. అంతేకాకుండా ఉప్పు రోజుకు 16 గ్రాముల వరకు పెరుగుతుంది.
 

45

ఎక్కువ ఉప్పు గ్యాస్ట్రిక్ మ్యూకోసా అని పిలువబడే గ్యాస్ట్రిక్ పొరను నాశనం చేస్తుంది. దీనిని పేగు మెటాప్లాసియా అంటారు. అలాగే అధిక ఉప్పు ఉంటే కడుపులో పెరిగే బ్యాక్టీరియాలో హెలికోబాక్టర్ పైలోరి ఒకటి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఈ బ్యాక్టీరియా కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
 

55

అందుకే ఊరగాయ, ఉప్పు లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తినకూడదు. అలాగే రోజువారీ ఉప్పును 6 గ్రాముల కంటే తక్కువగానే తీసుకోవాలి. దీనివల్ల గుండె జబ్బులే కాదు కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Isabgol Benefits: దీన్ని నీళ్లల్లో నానబెట్టి తాగితే పొద్దున్న కల్లా మీ మలబద్ధకం పరార్, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది
Recommended image2
Ice Apple: తాటి ముంజల్లో ఇన్ని పోషకాలా? తెలిస్తే బుట్టలు బుట్టలు కొంటారు
Recommended image3
Coriander Benefits: రోజులో ఒక్కసారి కొత్తిమీర వాటర్ తాగితే షుగర్ కంట్రోల్ అవ్వడం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved