Health Tips: కమ్మనైన బెల్లం.. అనారోగ్యానికి భేషయిన ఔషధం?
Health Tips: బెల్లం ఎంతో ఆది నుంచి ఔషధాలలో ప్రధాన పాత్ర వహిస్తుంది. నేటి రోజుల్లో బెల్లం తినడానికి పిల్లలు ఇష్టపడటం లేదు కానీ అందులో ఉండే ఔషధ గుణాలు అపారం. అవి ఏమిటో? ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం.

వాతావరణ మార్పు మనపై ప్రభావం చూపుతుంది.దీని మనం అనారోగ్యానికి గురవుతాం. వాతావరణ మార్పు వల్ల దగ్గు, జలుబు, జ్వరం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి బెల్లం ఉపయోగపడుతుందట. రోజూ ఒక బెల్లం ముక్కను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయట.
బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి మంచి చేస్తుందట.బెల్లం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బెల్లంలో ఉండే సైటో ప్రొటెక్టివ్ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. బెల్లం ఆహారం సులువుగా జీర్ణం అయ్యేందుకు ఉపయోగపడుతుంది. బెల్లం జబులు, ప్లూ, జ్వరం వంటి అనారోగ్య సమస్యలను నుంచి ఉపశమనం కలిగిస్తుందట.
మహిళలు, పిల్లల్లోనే రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. బెల్లం తినడం ద్వారా రక్తహీనత తగ్గుతుంది.చక్కెర స్థాయి చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అధికంగా బెల్లాన్ని వాడితే మాత్రం శరీర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుందట.
బెల్లం సహజ స్వీటెనర్‌గా ఉండటం వల్ల శరీరానికి ఉపయోగపడుతుంది. అయితే, అది స్వచ్ఛంగా లేకుండా కల్తీగా ఉండేమాత్రం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన పంచదార కంటే బెల్లం అన్ని రకాలుగా శ్రేయస్కరం. బెల్లంలోనూ అతి తెల్లగా ఉండే దాని కంటే నల్లగా ఉండే బెల్లమే మంచిది. అందులో తెల్లదనం కోసం ఏమీ కలపరు.
ఆ బెల్లం, నెయ్యి కాంబినేషన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.మీకు గొంతు నొప్పి, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వంటివి ఉంటే వేడి చేసిన బెల్లం, నెయ్యిని ప్రతి రోజూ రాత్రిపూట నిద్రపోయే ముందు 2 టీస్పూన్లు తీసుకోండి. ఇది మీ ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది.బెల్లం, నెయ్యీ కలిపి తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
బెల్లం ఎక్కువ తింటే వేడి చేస్తుంది. కాబట్టి కొద్దిగా తీసుకోవాలి. బెల్లం, నెయ్యితో తిన్న తర్వాతి రోజు మీకు వేడి చేసినట్లు అనిపిస్తే. బెల్లం వాడకం తగ్గించుకోవాలి. ఈ విధంగా సరైన మొత్తంలో బెల్లం తింటే మనకు చాలా విధాలుగా ఆరోగ్యకరమైన జీవితానికి ఉపయోగపడుతుంది.