వానాకాలంలో జర్నీ.. డెంగ్యూ, టైఫాయిడ్ రావొద్దంటే ఇలా చేయండి
వర్షాకాలంలో లేనిపోని రోగాలు వస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ, టైఫాయిడ్ లు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు.

జలుబు, దగ్గు, మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, టైఫాయిడ్ వంటి రోగాలు వానాకాలంలో ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా ఫ్యామిలీ హాలిడే కోసం ఎటైనా వెళ్లినప్పుడు. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలి. ఎందుకంటే జాగ్రత్తలు, పరిశుభ్రత లేని ప్రయాణం వర్షాకాలంలో సాధారణంగా వచ్చే వ్యాధుల బారిన పడేస్తుంది. ఇందుకోసం ఎలాంటి చిట్కాలను పాటించాలంటే?
శుభ్రమైన నీటిని తాగాలి
జర్నీలో శుభ్రమైన నీరేదో గుర్తిండం చాలా కష్టం. అందుకే ఎప్పుడూ కూడా మంచి బ్రాండ్ ద్వారా ప్యాక్ చేయబడిన వాటర్ బాటిల్ ను కొని తాగండి. మీకు వేరే మార్గం లేకపోతే తాగే ముందు మీకు అందుబాటులో ఉన్న నీటిని మరిగించండి.
జంక్ ఫుడ్ మానుకోండి
స్ట్రీట్, జంక్ ఫుడ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కానీ మీరు వెళ్లాలనుకున్న ప్లేస్ కు వెళ్లే మార్గంలో కనిపించే నోరూరించే పకోడీలు, బర్గర్లను తినడం మానుకోవాలి. స్ట్రీట్ ఫుడ్ కార్నర్లు అనేక బాక్టీరియల్ మాన్సూన్ వ్యాధులకు మూలం.
స్నానపు నీటిలో క్రిమిసంహారక మందు
మీరు ఎటు వెళ్లినా మీ చర్మానికి సరిపోయే క్రిమిసంహారక మందు బాటిల్ తీసుకెళ్లండి. అలాగే మీరు స్నానం చేయడానికి ఉపయోగించే బకెట్ నీటిలో కలపండి. బాత్ టబ్ ను ఉపయోగించకండి. లేదా క్లీన్ గా చేసిన తర్వాతనే దానిని వాడండి.
తడి దుస్తులు
జర్నీ చేయడానికి చాలా మంది కొన్ని దుస్తులను మాత్రమే తీసుకెళతారు. కాబట్టి సీజన్ ను పరిగణనలోకి తీసుకుంటే అవి తడిసే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ తడి బట్టలను వేసుకోవడం మంచిది కాదు. తడి బట్టల వల్ల అసౌకర్యంగా ఉండటమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
hand washing
పరిశుభ్రత పాటించండి
కోవిడ్ -19 ఎంట్రీ తర్వాతే మనందరికీ పరిశుభ్రత ప్రాముఖ్యం తెలిసొచ్చింది. పరిశుభ్రత మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. అందుకే హోటళ్లు, హోమ్ స్టేలు లేదా ఇతర ప్లేస్ లల్లో బస చేసేటప్పుడు పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి. ప్రతిరోజూ బెడ్ షీట్లను ఖచ్చితంగా మార్చండి. చేతులను శుభ్రంగా ఉంచుకోండి.
తగినంత నిద్ర
సూర్యోదయాన్ని చూడటం, అర్థరాత్రి పార్టీలకు హాజరు కావడం మీ జర్నీలో భాగం కావొచ్చు. నిజానికి ఇవి చాలా సరదాగా ఉంటాయి. కానీ వీటివల్ల కంటినిండా నిద్ర ఉండదు. మీరు ఇంట్లో ఉన్నా లేదా టూర్ కు వెళ్లినా ప్రతిరోజూ కనీసం 7 నుంచి 9 గంటలు ఖచ్చితంగా నిద్రపోండి.