ఉడికించిన గుడ్డా లేక ఆమ్లేటా.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
గుడ్డు మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది ప్రోటీన్ కు మంచి వనరు. అందుకే దీనిని రెగ్యులర్ గా తినేవారున్నారు. అయితే గుడ్డును ఒక్కొక్కరు ఒక్కోలా వండుకుని తింటుంటారు. కొందరు ఉడికించిన గుడ్లను తింటే మరికొందరు ఆమ్లేట్ వేసుకుని తింటుంటారు. గుడ్డుతో ప్రయోజనాలను పొందడానికి దీనిని ఎలా తినాలో తెలుసా?
egg
వారాలతో సంబంధం లేకుండా ప్రతిరోజూ గుడ్లను తినాలని చెప్తుంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే గుడ్డు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎనర్జిటిక్ గా ఉంచడంతో పాటుగా కండరాల అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డను తింటే రోజంతా శక్తివంతంగా ఉంటారు. అలసట అనేదే ఉండదు.
అయితే చాలా మంది గుడ్లను వేరు వేరు పద్దతుల్లో తింటుంటారు. అంటే కొందరు వీటిని ఉడకబెట్టి తింటే మరికొందరు ఆమ్లేట్ వేసుకుని తింటుంటారు. ఉడకబెట్టిన గుడ్డు కంటే ఆమ్లేట్ యే బలే టేస్టీగా ఉంటుంది. అందుకే చాలా మంది గుడ్డును ఆమ్లేట్ గానే ఎక్కువగా తింటుంటారు. మరి గుడ్డు ప్రయోజనాలను పొందడానికి దీన్ని ఉడకబెట్టి తినడం బెటరా? లేక ఆమ్లేట్ వేసుకుని తినడం బెటరా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గుడ్ల ప్రయోజనాలు
గుడ్డు సంపూర్ణ ఆహారం. ఇవి ప్రోటీన్లు మంచి వనరు. గుడ్డు కండరాలను మరమ్మత్తు చేస్తుంది. అలాగే వాటి పెరుగుదలకు సహాయపడుతుంది. గుడ్డులో విటమిన్ డి, విటమిన్ బి 12, రిబోఫ్లేవిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి. అలాగే వీటిలో ఉండే కోలిన్ మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి, అభివృద్ధికి సహాయపడుతుంది. గుడ్డులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. గుడ్డులో ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వు కూడా ఉంటుంది. ఇది మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
ఉడికించిన గుడ్డు
ఉడికించిన గుడ్డు పోషణకు గొప్ప మూలం. ఈ గుడ్డులో సుమారుగా 78 కేలరీలు ఉంటాయి. దీనిలో మన శరీరానికి అవసరమైన కొవ్వు, ప్రోటీన్లు, కొవ్వు , విటమిన్ డి, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డును ఉడకబెడితే దానిలో పోషకాలు అలాగే ఉంటాయి. అందుకే ఉడికించిన గుడ్డును తినడం మంచిదని అంటుంటారు. ఉడికించిన గుడ్లలో విటమిన్ బి 12, విటమిన్ డి, రిబోఫ్లేవిన్ లు మెండుగా ఉంటాయి. ఇవి మనకు శక్తిని అందిస్తాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఉడికించిన గుడ్లలో ఉండే కోలిన్ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆమ్లేట్
ఆమ్లెట్ ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. అయితే దీనిలో పోషకాలు మారే అవకాశం ఉంది. ఆమ్లెట్ కు జోడించిన ఇతర పదార్ధాల కారణంగా దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కేలరీలు, కొవ్వు కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంంది. ముఖ్యంగా దీన్ని మీరు ఎక్కువ నూనె లేదా వెన్నతో తయారుచేసినప్పుడు. ఆమ్లెట్లలో ఉపయోగించే కూరగాయలు, సన్నని ప్రోటీన్ మనకు ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి.
ఏది బెటర్ అంటే?
ఆమ్లేట్,ఉడికించిన గుడ్డులో.. మన ఆరోగ్యానికి ఉడికించిన గుడ్డే ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి కొవ్వు లేదా ఇతర పదార్థాలు ఆడ్ కావు. వీటిని ఉడకబెట్టడం వల్ల గుడ్డులోని పోషకాలన్నీ సురక్షితంగా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యకరమైందిగా పరిగణించబడుతుంది.