Health : అన్నం ప్రాణం పోయదు, తీస్తుంది.. పరబ్రహ్మ స్వరూపం కాదు యముడి రూపం
Health : అన్నం ప్రాణాలు కాపాడటం కాదు.. మెల్లిగా ప్రాణం తీస్తుంది. రోజూ తెల్లన్నం తినడంవల్ల ఎన్ని అనారోగ్య సమస్యలో. మరి ఏం తినాలి? ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలి?

ఈ నిజాలు తెలుసుకొండి
"నా తాత ముత్తాతలు హ్యాపీగా అన్నం తినేవారు ! ఇప్పుడు కొంతమంది దిక్కుమాలినోళ్లు అన్నం తినొద్దని ప్రచారం చేస్తున్నారు. దాన్ని పట్టించుకోకండి. హాయిగా అన్నం తినండి " సోషల్ మీడియాలో ఆహార ప్రియుల వ్యాఖ్యానాలు!
"మీరు చిన్నప్పుడు ఏమి తిన్నారో అదే తినండి. బాల్యం నుంచి మీరు తిన్న ఆహారానికి మీ శరీరం అలవాటు పడింది. అదని ఇదని ప్రయోగాలు చేసి ఆరోగ్యం చెడగొట్టుకోకండి "... కొంతమంది డాక్టర్ల సలహా.
మరి నిజాలు తెలుసుకొందామా?
1 . జీవ పరిణామ క్రమంలో భూమిపైకి మనిషి వచ్చి నలబై లక్షల సంవత్సరాలయ్యింది.
మన సులభ అవగాహన కోసం ఈ మొత్తం కాలాన్ని 24 గంటలు అనుకొందాము .
రోజు .. అర్ధ రాత్రి మొదలవుతుంది కదా ?
మనిషి వరి , గోధుమ... లాంటి పంటల్ని ఎప్పటి నుంచి పండిస్తున్నాడు?
ఆలోచించండి .
24 గంటల ఫ్రేమ్ వర్క్ లో తెల్లవారు జామున మూడు గంటలకు వరి గోధుమ పంటల సాగు మొదలయ్యిందా ?
కాదు .
పోనీ పొద్దున్న ఆరు ?
కాదు .
మధ్యాహ్నం 12 ?
లేదు .
అయ్యో ..
.. మరెప్పుడు ?
రాత్రి 11 . 55 కు మాత్రమే .
అంటే రోజు ముగుస్తుందన్న అయిదు నిముషాలకు .
మనిషి భూమి పైకొచ్చి 24 గంటలు అనుకొంటే మొదటి 23 గంటల 55 నిముషాలు పంటలే పండించ లేదు .
వరి లేదు .
గోధుమ లేదు .
తాతలు అంటే ఎవరు? ఆ పూర్వీకులు కారా?
నలబై లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న నవీన మానవుడి { హోమో సేపియన్స్ } పరిణామ క్రమంలో మొదటి ముప్పై తొమ్మిది లక్షల తొంబై అయిదు వేల సంవత్సరాలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయా?
కేవలం అయిదు వేల సంవత్సరాలు సూక్ష్మ పరిణామంలో ప్రభావం చూపుతుందా?
ఆలోచించండి ?
అసలే బిపి . పైగా మెట్ఫార్మిన్ మాత్రలు !
"అంటే ఏంటి ? మా తాతముత్తాతలు... అడవుల్లో ఉన్నారు కదా అని ఇప్పుడు ... ఆకులూ అలములు కట్టుకొని గుహల్లోకి వెళ్లి పోమంటారా " అని ఇక్కడి దాక చదివిన ఆహార ప్రియులు ఒళ్ళుమండి అడుగుతారు. !
పాపం బిపి ఎక్కువ .
ఆగండి.
అన్నం ముట్టొద్దు గురూ...
నిజం... తెల్లనం అంత రుచిగా ఉండదు .
తెలుసుకోకపోతే కాల్చేస్తుంది .
నిప్పు కదా మరి !
ఆకులు .. గుహలు ... ఆదిమ మానవుడు... వేట ఆహార సంగ్రహణ .. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం .
మనిషి... ఆహార ఉత్పాదన అంటే... పంటల్ని పండించడం మొదలెట్టినప్పటి నుంచి మాట్లాడుకొందాము
మన తాతముత్తాతలు తిన్న బియ్యం గురించి తెలుసుకొందాము.
యాభై ఏళ్ళ క్రితం దాక .. అంటే మీ నాన్న గారు .. వాళ్ళ నాన్న గారు .. తిన్న బియ్యం ఏటో తెలుసా ?
1 . మొలగొలుకులు { నెల్లూరోళ్లు }
2 . కర్నూల్ సోనా మసూరి { కర్నూల్ }
3 . పొన్ని .
4 . రంగసముద్రం సోనా మసూరి .
5 భోగవతి .
6 . కర్ణాటక పొన్ని .
7 . వెంపొన్ను .
8 . సీరగ సాంబ .
9 . కప్పకర్.
10 . మాప్పిళై సాంబ .
11 . క్రుంకురువై
12 . కుదైవజయ్ .
మార్కెట్ లోకి వెళ్లి ఈ బియ్యం వెరైటీస్ ఇప్పుడు దొరుకుతుందా? అని విచారించండి .
సంప్రదాయిక బియ్యం ప్రత్యేకతలు .
1 . వీటిలో పీచు ఎక్కువ . ఇందువల్ల గట్ హెల్త్ .
2 . యాంటియోక్సిడెంట్స్ ఎక్కువ . కాన్సర్ నుంచి రక్షణ .
౩. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ . అంటే డయాబెటిస్ రాదు . వచ్చినా అది అదుపులో ఉంటుంది .
4 . ఐరన్, జింక్, సెలీనియం లాంటి సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా వుండేది .
ఒక్క మాటలో చెప్పాలి అంటే అది ఆహారం .
తెల్లనం లాగా చెత్త కాదు .
తాతల పేరు చెప్పి మనం తింటున్నది ఇదీ...
నేటి తెల్లనం గురించి మాట్లాడుకొనే ముందు... తాతముత్తాల కాలం లో వడ్లని ఎలా బియ్యం గా మార్చేవారో... తప్పక చెప్పుకోవాలి .
అదే అసలు విషయం .
1 . ఉప్పుడు బియ్యం .. పారబోయిల్డ్ రైస్ . వడ్లను ఆవిరితో ఒక స్థాయి వరకు ఉడక బెట్టి .. అటుపై ఎండ బెట్టేవారు. తరువాత ... దంచి బియ్యం తీసేవారు. ఇందువల్ల నీటిలో కరిగే విటమిన్స్ , మినరల్స్ బియ్యం లోకి వెళ్ళేవి .
2 . రోటిలో వడ్లను పోసి దంచేవారు. ఇది భుజాలకు.. బిసిప్స్... ట్రై సెప్స్ కు వర్క్ అవుట్ .. వ్యాయామం . దానికి మించి పోషకాలు వేస్ట్ అయ్యేవి కావు.
తాతముత్తాల పేరు చెప్పి మీరు తింటున్న బియ్యం .
1 . ఎంటియూ - 7029 .
2 .బిపిటి 5204 .
౩ . జేజిఎల్ 1798 .
4 . స్వర్ణ సబ్- 1 .
5 ఐఆర్- 64
6 . పూస బాస్మతి .
ఈ బియ్యాన్ని పాలిష్ చేస్తున్నారు .
అందుకే ఇది తెల్లగా ధగధగలాడుతూ కన్పిస్తుంది .
1 పాలిష్ చెయ్యడం వల్ల పీచు, విటమిన్స్ , మినరల్స్ పోతాయి . మిగిలేది కేవలం కార్బోహైడ్రేట్స్ ... సింపుల్ కార్బ్స్.
2 . దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. బ్లడ్ షుగర్ స్పైక్స్ కు ఇది కారణం . అంటే డబ్బిచ్చి డయాబెటిస్ ను కొని తెచ్చుకోవడం .
మన తాతలు తిన్నది ఇలాంటి ఫుడ్...
మరి కొన్ని ముఖ్యమయిన విషయాలు.
1 . సాగునీటి సౌకర్యం పెద్దగా లేని రాయలసీమ, తెలంగాణ లాంటి చోట్ల జొన్న , సజ్జ , రాగులు పండించేవారు . సంగటి, అంబలి , రాగి రొట్టెలు , జొన్న రొట్టెలు , సజ్జ రొట్టెలు .. నెలలో 29 రోజులు .. రోజుకు మూడు పూటలు ... ఇవే జనాల తిండి .
అమావాస్య రోజు పితృ దేవతలకు ఆహారంగా... అన్నం సమర్పించి దాన్ని తినేవారు .
" ప్రతి రోజు అమావాస్యేనా ? " అనే సామెత ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంది.
అంటే అన్నం తో కూడిన.. విందు భోజనం... ప్రతి రోజు కాదు . ఎప్పుడో నెలకు ఒక రోజు .... పండగలు పబ్బాలు వచ్చినప్పుడే... అని అర్థం .
2 . ఇప్పటి లాగా ప్లేట్ నిండా అన్నం వేసుకొని తినే అలవాటు ఆ రోజుల్లో ఉండేది కాదు .
అన్నం కంటే ఎక్కువగా కాయగూరలు ఆకుకూరలు తినేవారు .
ఇంత సోదెందుకు ?
ఇప్పుడు మీ ముందు రెండు అప్షన్లు.
తాతముత్తాలు తిన్నారని కడుపునిండా తెల్లనం తినండి . ముందుగా ఫామిలీ ప్యాక్ వస్తుంది . అటు పై డయాబెటీస్ . అప్పుడు మెట్ఫార్మిన్ వేసుకోండి . మెల్లగా లివర్ కిడ్నీ లు రిపేర్ కొస్తాయి .
బిపి పెరుగుతుంది .
దానికోసం టాబ్లెట్ తీసుకోండి .
మోకాళ్ళ నొప్పులు వస్తాయి .
దానికి ఆపరేషన్ .
చివరిగా కాన్సర్ .
సంపాదించింది ఫార్మసురులకు దారబోసి ... టపా కట్టేయొచ్చు .
మరి అన్నేసి.. ఆసుపత్రులు మందుల షాప్స్ .... దియాగ్నస్టిక్ సెంటర్లు ..
వారంతా బతకాలా? వద్దా?
ఆరోగ్యవంతమైన ఆహారం
లేదంటే ఇలా చెయ్యండి .
వారంలో ఏడు రోజులు .. ఏడు ఇంటూ మూడు.. అంటే 21 పూటలు .
1 .
5 - 6 పూటలు సిరి ధాన్యాలు .
ఉదాలు, సామలు, కొర్రలు, అందుకొర్రలు.. లాంటివి .
ఇవి అరగవు అని కొంతమంది అనుకొంటారు .
కనీసం పది గంటలు నాన బెట్టాలి .
అన్నం గా చేస్తే చాలామందికి టేస్ట్ నచ్చక పోవచ్చు .
వీటితో ఇడ్లీ దోస మురుకులు లాంటివి చేసుకోవచ్చు .
2 .
5 - 6 పూటలు.. జొన్నలు రాగులు సజ్జలు .
జొన్న రొట్టె.. రాగి రొట్టె... సజ్జ రొట్టె.. అంబలి.. సంగటి.. జొన్న ఇడ్లీ రాగి ఇడ్లీ ... రాగి దోస .. ఇలా అనేకం ట్రై చేయండి .
సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే .
మైదా కలిసిన చెత్త గోధుమ పిండి తో పూరీ లు చపాతీలు చేసి తిని రోగాలు తెచ్చుకోవడం .
మల్టి గ్రైన్ అట్టా.. అంటే మొక్క జొన్న, రాగి, జొన్న, గోధుమ, పెసలు, మినుములు లాంటి వాటిని మరపట్టించి వాటితో.. పూరి చేసుకొని చికెన్ కర్రీ తో ... కోడి గుడ్డు పులుసుతో తింటే వుంటుంది చూడు .. నా సామీ రంగా !
౩.
5 -6 పూటలు.. దంపుడు బియ్యం అంటే బ్రౌన్ రైస్ ..
కేరళ రెడ్ రైస్ .. నమిలి తింటే టేస్ట్ అదుర్స్ . వామ్మో ఇంత లావా? అనుకొంటే లావై పోతారు .
... డబ్బు సమస్య కాదు అనుకొంటే బ్లాక్ రైస్ .
జాస్మిన్ రైస్ .
అబ్బా ఎన్ని వెరైటీస్ !
4 .
2 పూటలు బాస్మతి రైస్ .
బిర్యాని .
చిట్టి ముత్యాల బిర్యాని కూడా ట్రై చెయ్యండి .
నాలుకను సంతృప్తి పరచాలి కదా .
ఇక మిగిలిన 2 - ౩ పూటలు ... వైట్ రైస్ ఓకే.
ఇలా తినాలి .
ఇలా తినాలి...
1. వైట్ రైస్ తిన్నా బ్రౌన్ రైస్ తిన్నా.. అది కార్బ్స్ అని మర్చిపోకూడదు .
కార్బ్స్ యాభై శాతానికి దాటకూడదు .
కాయగూరల్లో కూడా కార్బ్స్ వుంటాయని మరిచిపోవద్దు .
ప్లేట్ లో అన్నం.. ఎంత పరిమాణం లో ఉందొ అంతే పరిమాణం లో ఖీర ... పచ్చిది ఉండాలి .
అవును ప్రతి పూట.
బ్రేక్ఫాస్ట్ కు కూడా తినాలి .
2. అన్నం కంటే రెండు మూడు రెట్లు.. కూర గాయాలు.. ఆకుకూరలు .. అవి సాంబార్ లో భాగం కావొచ్చు . లేదా ఫ్రై టైపు .
అంటే అన్నానికి మూడు నాలుగు రెట్లు ఖీర .. కాయగూరలు.. ఆకుకూరలు మీ కడుపులోకి .
డయాబెటీస్ .. అధిక బిపి.. అధిక బరువు .. కీళ్లనొప్పులు ఇంకా అనేక వ్యాధులు బయటకి .
దీనికి తోడు .
1 . మైదా వద్దు . కోలన్ కాన్సర్ వస్తుంది .
2 . పామ్ ఆయిల్ వద్దు . వేరుశనిగె , నువ్వులు , కొబ్బరి నూనెలు . అప్పుడప్పుడు ఆలివ్ ఆయిల్ .
గానుగ నూనెలు బెస్ట్ .
రిఫైన్డ్ ఆయిల్స్ వరస్ట్ .
౩. చక్కర వద్దు .
బెల్లం ఓకే .
అసలయిన తేనే { మార్కెట్ లో దొరికే వాటిలో తొంబై అయిదు శాతం చెక్కెర ద్రవాలు . ఆరోగ్యం నాశనం } తాటి బెల్లం బెస్ట్ .
4 . సొయా వద్దు .
5 . గుడ్ ఫ్యాట్స్ కోసం వాల్నట్స్ , కొబ్బరి, వేరుశనిగె ,
పరిమితంగా నెయ్యి
6 . ఆయా కాలాల్లో దొరికే పళ్ళు సూపర్ .
7. తినాలయ్యా తినాలమ్మా .. ప్రోటీన్ బాగా తినాలి .
లేకపోతె నలబై కే కళ్ళ కిందకు క్యారీ బాగ్స్ వచ్చేస్తాయి . లేస్తే కూర్చోలేరు . కూర్చుంటే లేవలేరు .
తినడం ఒక భోగం !
తినకపోవడం { డైటింగ్ పేరుతొ కడుపు మాడ్చుకోవడం } రోగం !
ఓరోరి అయ్యా .. వినరా !
నువ్వు తింటున్నది విషమేరా !