చర్మంపై దురదగా ఉంటుందా.? మీ కిడ్నీలు ప్రమాదంలో పడుతున్నట్లే
Health: శరీరంలో ఆరోగ్య సమస్యలను ముందుగానే కొన్ని లక్షణాల ద్వారా శరీరం మనల్ని ముందుగానే అలర్ట్ చేస్తుంది. కిడ్నీ సంబంధిత సమస్యలను చర్మం ముందుగానే చెబుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేలాగంటే..

కిడ్నీ సమస్యలను చర్మం చెప్పేస్తుంది
మూత్రపిండాలు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తూ, రక్తాన్ని శుభ్రం చేస్తాయి. ఇవి సరిగా పనిచేయకపోతే, విషపదార్థాలు రక్తంలో పేరుకుపోతాయి. ఈ మార్పులు మొదట చర్మంపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది. చాలా మంది దురద, పొడిబారడం లాంటి సమస్యలను వాతావరణం లేదా అలెర్జీలుగా భావిస్తారు. కానీ ఇవి మూత్రపిండాల పనితీరు తగ్గుతున్నదని సూచించే ప్రారంభ లక్షణాలు.
సాధారణంగా కనిపించే చర్మ లక్షణాలు
చర్మం పొడిబారడం
సాధారణంగా మూత్రపిండాలు ఖనిజాల సమతుల్యతను నిర్వహిస్తాయి. ఈ సమతుల్యత దెబ్బతింటే చర్మం చాలా పొడిగా మారి దురద పెరుగుతుంది. ఇది ఖనిజాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలకు సంకేతం కావచ్చు.
వాపు రావడం
మూత్రపిండాలు ద్రవాలను బయటకు పంపలేకపోతే శరీరంలో నీరు నిలుస్తుంది. ముఖం, కళ్ల చుట్టూ, పాదాలు, చీలమండలు, చేతుల వద్ద వాపు కనిపించడం సాధారణం. ఇది మూత్రపిండాల పనితీరు తగ్గిందని చెప్పే పెద్ద సంకేతం.
చర్మ రంగు మారడం
విష పదార్థాలు శరీరంలో ఎక్కువైతే చర్మం పసుపు లేదా మరింత వెలితిగా కనిపించవచ్చు. రక్తహీనత కూడా దీనికి కారణం అవుతుంది. ఈ మార్పులు ఎక్కువ రోజులు కొనసాగితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
దద్దుర్లు ఎందుకు వస్తాయి?
మూత్రపిండాల వైఫల్యం ఉన్నవారిలో శరీరమంతా తీవ్రమైన దురద వస్తుంది. భాస్వరం స్థాయిలు పెరగడం వల్ల ఈ దురద మరింత ఎక్కువవుతుంది. నిరంతరం గోకడం వల్ల గాయాలు, మచ్చలు లాంటివి జరుగుతాయి. దురద తగ్గించడానికి చర్మాన్ని తేమగా ఉంచడానికి భాస్వరం నియంత్రించడం చాలా ముఖ్యం.
మూత్రపిండాల సమస్యలకు సంబంధించిన ఇతర శరీర సంకేతాలు
చర్మ సమస్యలతో పాటు శరీరం చూపించే మరికొన్ని సంకేతాలు:
* అలసట, బలహీనత
* కాళ్లు, ముఖం వాపు
* నురుగు మూత్రం లేదా రక్తంతో కూడిన మూత్రం
* ఆకలి తగ్గడం
* రాత్రివేళ ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లడం
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.
చర్మ లక్షణాలను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు?
అమెరికా డెర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం, మూత్రపిండాలు దెబ్బతింటున్నప్పుడు మొదటగా బయటపడేది చర్మ సమస్యలే. నిరంతర దురద, అసహజ రంగు, పొడిబారడం లాంటివి డయాలసిస్‌కు చేరుకునే ముందే కనిపించే సాధారణ సంకేతాలు. సకాలంలో పరీక్షలు చేయించుకుంటే మూత్రపిండాల నష్టాన్ని నియంత్రించవచ్చు. కాబట్టి ఏదైనా చర్మ మార్పు గమనించిన వెంటనే వైద్యుల్ని సంప్రదించడం చాలా అవసరం.