మద్యపానం మితంగా తీసుకుంటే కలిగే నష్టాలు.. లాభాలు ఏంటో తెలుసా?
మద్యపానం (Alcohol) శరీర ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మద్యపానం సేవించడం కొందరికి ఆనందంగా, ఫ్యాషన్ గా ఉన్నప్పటికీ దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కొందరు అప్పుడప్పుడు తాగుతుంటారు. మరి కొందరు దీనికి పూర్తిగా బానిసలవుతున్నారు. మద్యపానం శరీర అన్ని అవయవాల మీద ప్రభావం చూపుతుంది. దీని కారణంగా అనేక అనారోగ్య సమస్యలు (Illness issues) కలుగుతాయి. అయితే మద్యం మితంగా తీసుకున్న ఆరోగ్యానికి ప్రమాదమే. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా మద్యపానం మితంగా తీసుకున్నా కలిగే ప్రమాదాల గురించి తెలుసుకుందాం..

జీవితంలో ఒక్కసారి మద్యపానానికి అలవాటు (Habit) పడ్డాక అనారోగ్య సమస్యలను మనమే కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది. మద్యం సేవించిన మొదటిలో ఎలాంటి హానీ (Harm) కలగకపోయినా దీని ప్రభావం నిదానంగా బయటపడుతుంది. మద్యపానం శరీరంలోని ప్రతి అవయవంపైన ప్రభావం చూపి వాటి పనితీరును తగ్గించి అనేక ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి.
అయితే రోజూ ఒక గ్లాస్ మద్యపానం తీసుకుంటే మంచిదని కొంత మంది భావిస్తారు. మితంగా (Moderation) తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటారు. కానీ మద్యపానం విధంగా తీసుకున్నా అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వారికి తెలియదు. అయితే మితమైన మద్యపానం కూడా ప్రమాదమే (Dangerous) అని ఒక పరిశోధనలో తేలింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మద్యపానం సేవించే వ్యక్తులపై ఒక సంస్థ పరిశోధన చేపట్టింది. కొద్ది మోతాదులో మద్యం సేవిస్తే గుండె జబ్బుల (Heart disease) నుంచి కాస్త రక్షణ లభించవచ్చేమో కానీ దీని కారణంగా ఇతర క్యాన్సర్ల (Cancers) వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొద్ది మోతాదులో మద్యం సేవిస్తే కలిగే లాభాల కన్నా ఎక్కువ మొత్తంలో నష్టం కలుగుతుంది.
అయితే తాజాగా ఒక సంస్థ రోజుకు ఒకసారి డ్రింక్ తీసుకునే వ్యక్తులపై, రోజుకు ఎక్కువ సార్లు డ్రింక్ తీసుకునే వ్యక్తులపై పరిశోధన చేపట్టింది. ఇందులో తక్కువగా డ్రింక్ తీసుకున్న వారికి నష్టం (Loss) తక్కువగా ఉన్నా దీని ప్రభావం (Effect) మెల్లమెల్లగా బయటపడుతుందని తేలింది. కనుక మద్యం మితంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.
రోజుకు ఒకసారి చేసే వారితో పోలిస్తే ఎక్కువసార్లు మద్యం చేసేవారిలో క్యాన్సర్ లక్షణాలు (Features) ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలాంటి వారిలో మెదడు పనితీరు మొద్దుబారిపోతుంది. వారు పూర్తిగా మద్యపానానికి బానిసలై (Enslaved) బాంధవ్యాలకు విలువ ఇవ్వరు. అయితే మితంగా తాగేవారిలో వీటి లక్షణాలు తొందరగా బయటపడవు. మెల్లమెల్లగా మద్యపాన ప్రభావం కనిపిస్తుంది.
మద్యపానం ఒక మత్తు (Intoxication) లాంటిది. మద్యపానం సేవించడం కొందరికీ సరదాగా, ఫ్యాషన్ గా ఉన్నా ఇది మనకు నష్టాన్ని కలిగిస్తుంది. మద్యపానాన్ని మితంగా తీసుకున్న ఇది మన జీవిత కాలాన్ని (Life span) తగ్గిస్తుంది. మన జీవితకాలాన్ని పెంచుకోవడం కోసం మద్యపానానికి దూరంగా ఉండడమే మంచిది. మీ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని వారితో బాంధవ్యాలను బలపరచడానికి ఈ దురలవాటుకు దూరంగా ఉండండి.