పురుషుల్లో అలాంటి శక్తిని పెంచే సూపర్ హెల్తీ ఫుడ్స్ ఇవే!
శృంగారం (Romance) అనేది మధురమైన తీయని అనుభూతి. ఈ మధురమైన క్షణాలను నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పురుషులు వారి జీవిత భాగస్వామికి అందించలేకపోతున్నారు.

అందుకే ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. శృంగారం అనేది మనిషి ఆరోగ్యాన్ని పెంచే మంచి మెడిసిన్ (Medicine) లాంటిది. కనుక పురుషుల్లో సంభోగ శక్తిని పెంచడానికి తీసుకోవల్సిన కొన్ని సూపర్ హెల్తీ ఫుడ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పురుషులు ఈ హెల్తీ ఫుడ్స్ ను తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తొలగిపోయి జీవిత భాగస్వామికి సంపూర్ణమైన అనుభూతిని అందించగలరు. ఇవి మీలోని శృంగార వాంఛలను (Erotic passions) పెంచి సంభోగ శక్తిని (Sexual potency) మరింత రెట్టింపు చేస్తాయి. దీంతో పడక గదిలో సంపూర్ణమైన తృప్తిని మీ భాగస్వామితో కలిసి పొందగలుగుతారు.
గుడ్లు: గుడ్లలో (Eggs) ప్రోటీన్స్, విటమిన్ బి5, బి6 వంటి పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో హార్మోన్ లెవెల్స్ (Hormone levels) ను సమనస్థాయిలో ఉంచి ఒత్తిడిని దూరం చేసి లైంగిక వాంఛలను పెంచుతాయి. కనుక ప్రతి రోజూ ఒక గుడ్డును తీసుకుంటే మీ శృంగార జీవితం రసవత్తరంగా మారుతుంది.
అరటిపండు: అరటిపండును (Banana) తీసుకుంటే సంభోగ శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే సహజసిద్ధమైన బ్రోమెలిన్ (Bromelain) అనే ఎంజైమ్ పురుషులలో శృంగార శక్తిని రెట్టింపు చేస్తుంది. అలాగే ఇందులో ఉండే పొటాషియం, విటమిన్ సి శరీరానికి శక్తిని అందించి లైంగిక కలయికలో ఎక్కువసేపు పాల్గొనేందుకు సహాయపడతాయి.
పుచ్చకాయ: పుచ్చకాయలో (Watermelon) అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషుల జననాంగాలకు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. అలాగే పురుషుల్లో ఏర్పడే అంగస్తంభన (Erection) సమస్యలను తగ్గించి శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనేందుకు సహాయపడతాయి.
దానిమ్మ: దానిమ్మలో (Pomegranate) ఉండే రసాయన సమ్మేళనాలు ఒత్తిడిని తగ్గించి పురుషుల శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పురుషులలో ఆరోగ్యకరమైన వీర్య (Sperm) ఉత్పత్తికి సహాయపడుతాయి. కనుక ప్రతి రోజూ దానిమ్మ జ్యూస్ ను తీసుకుంటే శృంగార జీవితాన్ని పూర్తిగా సాధించగలరు.
వెల్లుల్లి: వెల్లుల్లిలో (Garlic) ఉండే ఎల్లిసిన్ (Ellisin) అనే రసాయనం లైంగిక సమస్యలను తగ్గించి లైంగిక కోరికలను పెంచుతుంది. కనుక వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే శృంగారేచ్ఛను తారా స్థాయికి తీసుకునేందుకు సహాయపడుతుంది. దీంతో జీవిత భాగస్వామితో కలిసి కలయికను పూర్తిగా ఆస్వాదిస్తారు.
అంజీరా పండు: అంజీరాలను (Fig) తీసుకుంటే పురుషులలో వీర్యకణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో సంతానోత్పత్తి (Fertility) సామర్ధ్యం రెట్టింపవుతుంది. అలాగే సంతానలేమి సమస్యలు కూడా తగ్గిస్తుంది. కనుక ప్రతిరోజు అంజీర పండ్లను తీసుకుంటే పురుషుల్లో సంభోగ శక్తి పెరిగి దాంపత్య జీవితం బాగుంటుంది.