- Home
- Life
- Health
- ఎత్తు చెప్పులను వేసుకుంటున్నారా అయితే వీటి కారణంగా శరీరానికి కలిగే నష్టాలు ఎన్నో తెలుసా?
ఎత్తు చెప్పులను వేసుకుంటున్నారా అయితే వీటి కారణంగా శరీరానికి కలిగే నష్టాలు ఎన్నో తెలుసా?
మార్కెట్ లో వివిధ రకాల హై హిల్స్ (High Hills), పెన్సిల్ హిల్స్ వంటి చెప్పులు వచ్చాయి. ఇవి చూడటానికి బాగానే ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఎత్తైన చెప్పులు మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ చెప్పులను అప్పుడప్పుడు ఫంక్షన్లకు వేసుకుంటే పర్వాలేదు కానీ ఎక్కువసేపు వేసుకొని నిల్చున్నా, నడిచినా ఇవి మడమలకు హాని కలిగిస్తాయి. చాలా మంది హై హీల్స్ అందంగా ఉండడానికి స్టైల్ గా (Style) వాడుతుంటారు. కానీ ఇవి మనకు కలిగించే హాని గురించి వారికి తెలియదు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా ఎత్తు చెప్పులను ఎక్కువసేపు వేసుకుంటే కలిగే అనర్ధాలు గురించి తెలుసుకుందాం..

పొట్టిగా ఉన్న వారు, పొడవుగా ఉన్న వారు ఇలా ఎత్తుతో సంబంధం లేకుండా అందరూ ఎత్తైన చెప్పుల వాడకాన్ని వినియోగిస్తున్నారు. చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్లు వరకు ఇలా అధిక మొత్తంలో మహిళలు హై హీల్స్ వాడకాన్ని ఉపయోగిస్తున్నారు. ఇవి చూడటానికి కళ్ళకు అందంగా ఉన్నా, వాటితో కలిగే నష్టాల (Losses) గురించి మనకి పూర్తిస్థాయిలో తెలియదు. కానీ వీటి వాడకం ఎంత తక్కువగా ఉంటే అంత కాలి మడమల ఆరోగ్యానికి (Heel health) మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని వేసుకుంటే కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.
హై హిల్స్ చెప్పులను ఎక్కువసేపు వేసుకుంటే మడమల నొప్పులు (Heel pains) వస్తాయి. ఎత్తయిన చెప్పులను ఎక్కువసేపు వేసుకొని నడవడం, నిలబడ్డం చేయడంతో కీళ్ల నొప్పులు, నడుము నొప్పి (Low back pain) వచ్చే అవకాశాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. కొన్ని ఎత్తైన చెప్పుల కారణంగా మునివేళ్ల మీద అధిక ఒత్తిడి పడడంతో బొటనవేలు వంకర పోవడం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ళ మడమలు అరిగిపోవడం జరుగుతాయి.
ఎత్తైన చెప్పులు వేసుకొని నడిచే సమయంలో జారిపడే అవకాశాలు (Chances of slipping) ఎక్కువగా ఉన్నాయి. అందుకే కొత్త చెప్పులను ఎంచుకునే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎత్తైన చెప్పులు చూడడానికి అందంగా ఉన్న వేసుకోవడానికి అసౌకర్యంగా (Discomfort) వుంటాయి. కానీ ఆ అసౌకర్యాన్ని పక్కనపెట్టి అందంగా కనిపించడం కోసం ఎక్కువగా వాడుతుంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఎక్కువసేపు ఎత్తయిన చెప్పులను వాడుతున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగవు.
వారు తీసుకొనే జాగ్రత్తల (Precautions) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఎత్తయిన చెప్పులను కొనే సమయంలో వాటిని అక్కడే వేసుకొని ఒకసారి నడవడానికి ట్రై చేయాలి. మీరు వేసుకోవడానికి ఆ చెప్పులు సౌకర్యంగా (Comfort) అనిపిస్తే తీసుకోండి. కాలి మడమలు ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఎత్తు చెప్పులను ఎంచుకోవడం మంచిది. పెన్సిల్ హిల్ వంటి చెప్పులను తీసుకోరాదు. ఇవి మడమల నొప్పికి కారణమవుతాయి.
కొత్త చెప్పులు వేసుకుని సమయంలో కాస్త బిగుతుగా (Tight) ఉంటాయి. వీటి కారణంగా కాలి మీద దురద, మంట ఏర్పడి బొబ్బులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక మొదట సాక్సులను ధరించి చెప్పులు వేసుకోవడం మంచిది. ఇలా చేయడంతో చెప్పులు కొద్దిగా వదులుగా అవుతాయి. ఇవి కాలి పాదాలకు ఎటువంటి హాని కలుగ చేయవు. కాళ్లకు మెత్తగా ఉండేలా చెప్పులను ఎంచుకోండి (Select).