మీ పెదాలు ఏ రంగులో ఉన్నాయి.. ఈ కలర్ లో ఉంటే కొన్ని రోగాలు ఉన్నట్టే..!
నిజానికి పెదవుల రంగు మారడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది ఎన్నో రోగాలకు సంకేతమంటున్నారు నిపుణులు. పెదాలు ఏ రంగులో ఉండే మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..
Beauty
ఒక్కొక్కరి పెదవులు ఒక్కో రంగులో ఉంటాయి. ఇది సాధారణ విషయమే. అయితే కొందరి పెదవులు ఎప్పుడూ రంగు మారుతూనే ఉంటాయి. కొన్ని సార్లు నల్లగా, ఇంకొన్ని సార్లు తెల్లగా, ఎర్రగా మారుతూ ఉంటాయి. కానీ ఇలా పెదాలు రంగు మారడం మంచి సంకేతం కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పెదవుల రంగు మారడం వాస్తవానికి శరీరంలోని వ్యాధులకు సంకేతమని నిపుణులు అంటున్నారు. అంటే మీ పెదవులు ఎరుపు లేదా పసుపు లేదా నలుపు రంగులో కనిపిస్తే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమని అర్థం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెదాలు ఏ రంగులో మారితే మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎర్రని పెదవులు
మీ పెదవులు ఎర్రగా ఉంటే మీకు ఏదో ఒక కాలేయ సంబంధిత వ్యాధి ఉందని అర్థం చేసుకోవాలి. అయితే సాధారణంగా మన పెదవులు పింక్ కలర్ లో ఉండాలి. కానీ పెదవులు ఎర్రగా మారితే అది కాలేయ సమస్యను సూచిస్తుందని నిపుణులు అంటున్నారు. మీ కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే అప్పుడు మీ పెదవుల రంగు ఎర్రగా మారుతుంది. మీరు ఏదో ఒక అలెర్జీతో బాధపడుతున్నారని కూడా ఇది సూచిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
నల్లని పెదవులు
బ్యూటీ ప్రొడక్ట్స్ ను మరీ ఎక్కువగా వాడేవారి పెదవులు రానురాను నల్లగా మారుతాయి. ఇది మనందరికీ తెలిసిందే. అంతే కాదు సిగరెట్ తాగేవారి పెదవులు కూడా నల్లగా మారడం మొదలవుతుంది.
తెల్లని పెదవులు
మీ పెదవుల రంగు పసుపు, తెలుపు రంగులోకి మారడం ప్రారంభిస్తే.. మీరు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని అర్థం. రక్తహీనత సమస్య వల్ల రక్తం పెదవులకు అందక తెల్లగా మారుతాయి. ఇది కాకుండా బిలిరుబిన్ స్థాయి పెరగడం వల్ల కూడా మీ పెదవులు తెల్లగా మారుతాయి.