MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • తంగేడు చెట్టు గురించి మీకు తెలుసా.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తంగేడు చెట్టు గురించి మీకు తెలుసా.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తంగేడు చెట్లు (Tangedu trees) ఎక్కువగా కొండ ప్రాంతాలలో ఉంటాయి. ఈ చెట్టుకు ఉండే పసుపు రంగు పూలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ చెట్టులో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి (Improve health) అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి. మరి ఈ చెట్టును ఏ విధంగా ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

2 Min read
Navya G
Published : Jul 16 2022, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

తంగేడు పువ్వులు, ఆకులు, బెరడు, వేర్లు ఇలా ఈ మొక్క అన్ని భాగాలు అద్భుతమైన ఔషధ గుణాలను (Medicinal properties) కలిగి ఉంటాయి. అందుకే పూర్వం నుంచి ఈ మొక్కను ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, బెరడు వేర్లతో తయారు చేసుకునే కషాయాలు అనేక అనారోగ్య సమస్యలను (Health problems) తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
 

27
Asianet Image

మలబద్ధకం తగ్గుతుంది: తంగేడు ఆకుల పొడిని (Tangedu leaves powder) ఒక గ్లాసు గోరువెచ్చట నీటితో కలిపి ఉదయాన్నే తీసుకుంటే పేగులలో పేరుకుపోయిన మలం తేలికపడి మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. కనుక మలబద్ధక సమస్యలతో (Constipation problem) బాధపడేవారు తంగేడు ఆకుల కషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 

37
Asianet Image

అతిమూత్ర వ్యాధి సమస్యలు తగ్గుతాయి: కొందరిలో మూత్రం అధికంగా పోతుంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి తంగేడు పూల పొడి (Tangedu flower powder), బెల్లాన్ని (Jaggery) సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం తయారు చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ప్రతిరోజు సగం స్పూన్ చొప్పున తీసుకుంటే అతిమూత్ర వ్యాధి సమస్యలు తగ్గుతాయి.
 

47
Asianet Image

నీళ్ల విరోచనాలు తగ్గుతాయి: ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు, తంగేడు చెట్టు వేర్లను (Tangedu tree roots) వేసి బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని వడగట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా ఈ చెట్టు వేర్లతో చేసుకునే కషాయం నీళ్ల విరోచనాలను (Dysentery) తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది.
 

57
Asianet Image

మధుమేహం అదుపులో ఉంటుంది:  తంగేడు పూల కషాయం మధుమేహాన్ని (Diabetes) అదుపులో ఉంచుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు, తంగేడు పువ్వులు (Tangedu flowers), ఒక స్పూన్ నల్ల వక్కల పొడి వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడగట్టుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా నెల రోజుల పాటు తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
 

67
Asianet Image

చర్మ నిగారింపు పెరుగుతుంది: తంగేడు పూలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తంగేడు పూల పొడికి (Tangedu flower powder) కొద్దిగా సెనగపిండి (Gram flour) కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం నిగారింపు పెరుగుతుంది.
 

77
Asianet Image

పాదాల పగుళ్ల నొప్పి తగ్గుతుంది: తంగేడు ఆకులను (Tangedu leaves) మజ్జిగతో (Buttermilk) కలిపి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాల పగుళ్లు ఉన్నచోట అప్లై చేసుకుని అరగంట తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పాదాల పగుళ్ల నొప్పి తగ్గుతుంది. అలాగే పాదాల పగుళ్లు కూడా రావు.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved