రెగ్యులర్ సెక్స్ తో ఆడవాళ్లకు బోలెడు లాభాలు.. ఏంటేంటంటే?
సెక్స్ తో శారీరక ఆనందమే కాదు.. ఇదెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. సెక్స్ ఒక వ్యాయామంలా పనిచేసి గుండెను బలంగా చేస్తుంది. కేలరీలను కరిగిస్తుంది. ఎన్నో రోగాల ముప్పును కూడా తప్పిస్తుంది.
ఒత్తిడికి గురైనప్పుడు చాలా జంటలు సెక్స్ కు దూరంగా ఉంటాయి. కానీ మీ మానసిక స్థితి సరిగ్గా ఉండి ఈ సమయంలో సెక్స్ లో పాల్గొంటే ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. సురక్షితమైన సెక్స్ లో పాల్గొనడం వల్ల స్త్రీ శారీరక, భావోద్వేగ, మానసిక శ్రేయస్సుపై ఎన్నో సానుకూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. తరచుగా సెక్స్ లో పాల్గొనే మహిళలు వారి భాగస్వామితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారట. ఇది వారిలో ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగూ వారి మొత్తం జీవితాన్ని సుఖ సంతోషాలతో ఉంచుతుంది. రెగ్యులర్ సెక్స్ వల్ల ఆడవారికి ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Marrige sex
నిపుణుల ప్రకారం.. లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం ఆరోగ్యకరమైంది. ఎందుకంటే ఇది మనస్సు, శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా సెక్స్ లో పాల్గొనడం శారీరక, భావోద్వేగ శ్రేయస్సు రెండింటినీ సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.
Image: Getty Images
భావోద్వేగ సాన్నిహిత్యం
రెగ్యులర్ సెక్స్ భావోద్వేగ సాన్నిహిత్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే భాగస్వాముల మధ్య మంచి సంబంధాన్ని పెంపొందిస్తుంది. 'లవ్ హార్మోన్' గా పిలిచే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ సెక్స్, శారీరక స్పర్శ సమయంలో విడుదలవుతుంది. ఈ హార్మోన్ భావోద్వేగ బంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే భాగస్వాముల మధ్య నమ్మకం, ఆప్యాయతను కూడా పెంచుతుంది.
Image: Getty Images
గుండె ఆరోగ్యం
క్రమం తప్పకుండా సెక్స్ లో పాల్గొనడం వల్ల మీ గుండె ఆరోగ్యం బాగుంటుంది. సెక్స్ హృదయనాళ వ్యాయామాన్ని అందిస్తుంది. సెక్స్ సమయంలో హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అలాగే రక్త ప్రవాహం, ఆక్సిజన్ వినియోగం బాగా పెరుగుతాయి. ఇది మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రెగ్యులర్ సెక్స్ మహిళల్లో గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
క్రమం తప్పకుండా సెక్స్ లో పాల్గొంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. లైంగిక ఉద్రేకం ఇమ్యునోగ్లోబులిన్ ఎ (ఐజిఎ) ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది యాంటీబాడీ. ఇది అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగితే మహిళలకు అనారోగ్యాలు, అంటువ్యాధులు రావు. అలాగే వచ్చినా తొందరగా తగ్గిపోతాయి.
ఒత్తిడి తగ్గుతుంది
లైంగిక కార్యకాలాపాలు మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా సెక్స్ ఒత్తిడిని తగ్గిస్తుంది. సెక్స్ సమయంలో శరీరం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. దీనిని "ఫీల్-గుడ్" హార్మోన్లు అని కూడా అంటారు. ఈ రసాయనాలు ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గించడానికి సహాయపడతాయి. సెక్స్ తో మహిళలు మరింత రిలాక్స్డ్ గా ఉంటారు. క్రమం తప్పకుండా సెక్స్ లో పాల్గొనడం వల్ల వీరి మొత్తం ఆరోగ్యంగా మెరుగ్గా ఉంటుంది.
నొప్పి నివారణ
సెక్స్ సమయంలో ఎండార్ఫిన్లు విడుదల అయ్యి ఒత్తిడి తగ్గడమే కాకుండా ఇది నొప్పిని కూడా తగ్గిస్తుంది. సెక్స్ సహజ నొప్పి నివారిణిగా కూడా పనిచేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొంతమంది మహిళలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్న తర్వాత తలనొప్పి, రుతుక్రమ తిమ్మిరి, ఇతర శరీర నొప్పుల నుంచి తాత్కాలిక ఉపశమనం పొందుతారు.
నిద్ర మెరుగుపరుస్తుంది
క్రమం తప్పకుండా సెక్స్ లో పాల్గొనే మహిళలు నిద్రపోవడానికి ఎలాంటి ఇబ్బంది పడరని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ నిద్రలేమి సమస్యను పోగొడుతుంది. గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. సెక్స్ సమయంలో ఎండార్ఫిన్లు రిలీజ్ అవ్వడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా ఇది విశ్రాంతి తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇది మంచి నిద్ర విధానాలకు దారితీస్తుంది. అలాగే నిద్రలేమి సమస్యను కూడా పోగొడుతుంది.
కటి ఫ్లోర్ కండరాలు బలోపేతం
క్రమం తప్పకుండా సెక్స్ లో పాల్గొనడం వల్ల కటి ఫ్లోర్ కండరాలు బలోపేతం అవుతాయంటున్నారు నిపుణులు. ఈ కటిఫ్లోర్ కండరాలు మూత్రాశయం, గర్భాశయం, ప్రేగుకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సెక్స్ ఈ కండరాలకు వ్యాయామంలా పనిచిసి వీటిని బలోపేతం చేస్తాయి. మెరుగైన మూత్రాశయ నియంత్రణకు దోహదం చేస్తాయి. కటి ఫ్లోర్ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే లైంగిక సంతృప్తిని కూడా పెంచుతాయి.
మెరుగైన అభిజ్ఞా పనితీరు
లైంగికంగా చురుకుగా ఉండే మహిళలు.. ముఖ్యంగా వృద్ధాప్యంలో మెరుగైన అభిజ్ఞా పనితీరును కలిగి ఉన్నారని ఒక అధ్యయనం కనుగొంది. ఇవేకాదు లైంగికంగా చురుగ్గా ఉండే మహిళలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు.