జాజికాయతో బోలెడు లాభాలు.. ఎన్ని సమస్యలను తగ్గిస్తుందో తెలుసా?
జాజికాయలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. ఈ జాజికాయ కీళ్ల నొప్పులను, కండరాల నొప్పులను తగ్గించడంతో పాటుగా వాపును కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఇది రాత్రిపూట హాయిగా పడుకోవడానికి కూడా సహాయపడుతుంది తెలుసా?

జాజికాయ మనందరికీ తెలిసిన మసాలా దినుసే. కానీ మనలో చాలా మందికి ఇది చేసే మేలు గురించి మాత్రం తెలియదు. కూరలు రుచిగా, వాసన కోసం జాజికాయను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. నిజానికి జాజికాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ కాయ మొత్తం ఎన్నో ఔషదగుణాలను కలిగి ఉంటుంది. అందుకే దీన్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు ఉపయోగిస్తుంటారు.
జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. జాజికాయ నూనె ఒక గొప్ప నొప్పి నివారణా కూడా. ఈ జాజికాయ క్యాన్సర్ ను నివారించడానికి కూడా సహాయపడుతుంది. జాజికాయ పెద్దప్రేగు క్యాన్సర్ ను నివారించగలదని పలు పరిశోధనల్లో తేలింది. అంతేకాదు ఇది కీళ్లు, కండరాల నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
జాజికాయను వాపు, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, పుండ్లకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అలాగే జాజికాయ ఒత్తిడిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది తెలుసా? అంతేకాదు దీన్ని రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు కలుపుకుని తాగితే ప్రశాంతంగా, తొందరగా నిద్ర పడుతుంది.
జాజికాయను వాపు, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, పుండ్లకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అలాగే జాజికాయ ఒత్తిడిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది తెలుసా? అంతేకాదు దీన్ని రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు కలుపుకుని తాగితే ప్రశాంతంగా, తొందరగా నిద్ర పడుతుంది.
జాజికాయ మెదడులోని నరాలను ఉత్తేజపరుస్తుంది. నిరాశ, ఆందోళనలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ జాజికాయ సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమలను వదిలించుకోవడానికి కూడా సహాయపడతాయి.
అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారాలు అవయవాలలో విషాన్ని పెంచుతాయి. అయితే జాజికాయ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే కాలేయం, మూత్రపిండాల నుంచి విషాన్ని తొలగిస్తుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా తొలగించడానికి ఇది సహాయపడుతుంది.