- Home
- Life
- Health
- Health Tips: రాత్రి మిగిలిన చపాతీని పడేస్తున్నారా.. అయితే ఈ బెనిఫిట్స్ అన్నీ కోల్పోతున్నట్లే?
Health Tips: రాత్రి మిగిలిన చపాతీని పడేస్తున్నారా.. అయితే ఈ బెనిఫిట్స్ అన్నీ కోల్పోతున్నట్లే?
Health Tips: సాధారణంగా వైద్యులందరూ తాజా ఆహారాన్ని తీసుకోమని చెప్తారు. కానీ ఒక్క చపాతి విషయంలో మాత్రం ఆ రూల్ వర్తించదు. ఎందుకంటే రాత్రి మిగిలిపోయిన చపాతీ పొద్దున్నే తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అపారం. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మనలో చాలామంది రాత్రిపూట మిగిలిపోయిన చపాతీలను, రోటీలను పెంపుడు జంతువులకి పెడుతుంటారు. లేదంటే బయట పారేస్తారు. కానీ రాత్రి మిగిలిపోయిన చపాతీలు పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే డయాబెటిస్ నుంచి తప్పించుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.
నిలువ ఉన్న చపాతీలలో స్టార్చ్ నిరోధకత అనేది పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గించడానికి సహాయపడుతుంది. బ్రేక్ ఫాస్ట్ లో పాలు, కూరలతో కలిపి రాత్రి పూట మిగిలిన చపాతీలు రోటిలో తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
అలాగే హై బ్లడ్ షుగర్ సమస్యతో బాధపడేవారు కచ్చితంగా వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే 15 నిమిషాల పాటు పాలల్లో నానబెట్టి తినటం వలన మరింత అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. నిల్వ ఉన్న చపాతీలు, రోటీలు ఉదర సమస్యలు రాకుండా చూస్తాయి.
జీర్ణ సమస్యల భారం నుంచి కాపాడుతాయి. చపాతి తయారుచేసిన 12 నుంచి 15 గంటలలోపు తినాలి అంతేకానీ రాత్రి చేసిన చపాతీలని లంచ్ కి ఉపయోగించకూడదు. అలాగే రాత్రి మిగిలిపోయిన చపాతీలని వెంటనే పాలలో నానబెట్టండి.
అవి ఉదయం పూట తింటే మలబద్దకం, ఎసిడిటీ, గ్యాస్టిక్ వంటి జీర్ణ సమస్యలు దూరం చెయ్యడమే కాకుండా శరీరానికి శక్తిని అందిస్తాయి. హైపర్ టెన్షన్ ఉన్నవారు అధిక రక్తపోటుతో బాధపడేవారు బ్రేక్ ఫాస్ట్ గా రాత్రి మిగిలిన చపాతీలని తింటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
అలాగే గోధుమల్లో ఉండే విటమిన్స్ తో పాటు ఉండే పోషక పదార్థాలు మనలో ఉండే రక్తహీనతని తగ్గిస్తాయి. కాబట్టి మిగిలిపోయిన చపాతీలను పారవేయకండి. అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గుర్తించి పొద్దున బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోండి.