MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • ఇండోర్ సైక్లింగ్ తో ఏమేం లాభాలున్నాయో తెలుసా?

ఇండోర్ సైక్లింగ్ తో ఏమేం లాభాలున్నాయో తెలుసా?

ఇండోర్ సైక్లింగ్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది శరీరాన్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా గుండె జబ్బుల ముప్పును కూడా తగ్గిస్తుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 04 2023, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇండోర్ సైక్లింగ్ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పబ్మెడ్ ప్రచురించిన 2019 సమీక్ష ప్రకారం.. ఇండోర్ సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన ఆహారంతో కలిపినప్పుడు.. ఇది ఒక వ్యక్తిని ఎన్నో రోగాల ముప్పు నుంచి కాపాడుతుంది. ఇది మీ ఏరోబిక్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇండోర్ సైక్లింగ్ తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
heart health

heart health

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఇండోర్ సైక్లింగ్ మంచి హృదయనాళ వ్యాయామం. ఇండోర్ సైక్లింగ్ హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది మీ గుండె కండరాలను బలోపేతం చేయడానికి, శరీరంలోకి రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయడానికి సహాయపడుతుంది. ఈ వ్యాయామాన్ని స్థిరంగా చేయడం వల్ల రక్త ప్రసరణ, ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. దీంతో అధిక రక్తపోటు పోటు సమస్యలు రావు. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. 
 

36
Weight Loss

Weight Loss

బరువు తగ్గడాన్ని పెంచుతుంది

ఏ రకమైన కదలిక అయినా సరే శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. సైక్లింగ్ ఎఫెక్టీవ్ కేలరీల బర్నింగ్ వ్యాయామం. సైక్లింగ్ తో బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం.. 70 కిలోల బరువున్న వ్యక్తి ఇండోర్ సైక్లింగ్ వల్ల 250 నిమిషాల్లో 30 కేలరీలను బర్న్ చేయగలడు. అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే జిమ్ముకు బదులుగా ఇంట్లో ఉండి దీన్ని తొక్కండి. 

అంతేకాదు ఈ సైకిల్ ను తొక్కడం వల్ల మీ కాలు కదలికలు మెరుగుపడతాయి. మీ కాళ్లలోని కండరాల సమూహాలు - క్వాడ్రిసెప్స్, గ్లూట్స్, తొడ కండరాలు కాలక్రమేణా బలంగా,  టోన్ అయ్యేలా చేస్తాయి.
 

46

ఇండోర్ సైక్లింగ్ మీ కీళ్లకు మంచిది

ఇండోర్ సైక్లింగ్ ప్రభావవంతమైన తక్కువ-ప్రభావ వ్యాయామంగా పరిగణించబడుతుంది. ఇది వృద్ధులకు, మోకాలి, కీళ్ల నొప్పులు ఉన్నవారికి బాగా సహాయపడుతుంది. ఇది కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.  మోకాలి సమస్య లేదా వెన్నునొప్పి ఉన్నవారు ఇండోర్ సైక్లింగ్ కు ముుందు డాక్టర్ తో మాట్లాడాలి. వైద్యుడి సలహా మేరకే ఈ సైకిల్ ను తొక్కాలి.
 

56
Image: Getty

Image: Getty

ఒత్తిడిని తగ్గిస్తుంది

ఇండోర్ సైక్లింగ్ మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఏదో ఒక రూపంలో శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల మీ శరీరం ఎండార్ఫిన్లు అని పిలువబడే ఫీల్-గుడ్ హార్మోన్లను రిలిజ్ చేస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం.. సైక్లింగ్ డోపామైన్, సెరోటోనిన్ ను కూడా పెంచుతుంది. ఇది విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఫలితంగా మీ మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడి స్థాయిలు కూడా తగ్గుతాయి. 
 

66

స్టామినాను మెరుగుపరుస్తుంది

ఇండోర్ సైక్లింగ్ మీ స్టామినాను పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తొక్కుతుంటే మీ అలసట క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఇది రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి, ఇతర తీవ్రమైన వ్యాయామాలలో పాల్గొనడానికి ఎక్కువ శక్తి, సామర్థ్యాన్ని కలిగి ఉండటానికి సహాయపడుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved