MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • తరచూ శృంగారం చేసేవారికి, వారానికొకసారి పాల్గొనే వారికి మధ్య తేడా ఏంటి?

తరచూ శృంగారం చేసేవారికి, వారానికొకసారి పాల్గొనే వారికి మధ్య తేడా ఏంటి?

శృంగారం (Romance) అనే పేరు వినగానే చాలామంది సిగ్గుపడతారు. ఆ విషయం గురించి చర్చించడానికి మొహమాట పడతారు. వివాహబంధం తర్వాత భార్యభర్తల మధ్య శృంగారం అనేది కేవలం రెండు శరీరాలు పెనవేసుకుపోవడం కాదు. శృంగారం అనేది ఇద్దరి వ్యక్తుల మనసులను ఒక్కటిగా చేసి మానసికంగా, శారీరకంగా దగ్గర చేసే ప్రక్రియ. అయితే శృంగారంతో అనేక ప్రయోజనాలు (Benefits) ఉన్నాయని ఒక సంస్థ చేపట్టిన పరిశోధనలో తేలింది. కాబట్టి తరచూ శృంగారం చేసే వారికి వారానికి ఒకసారి పాల్గొనే వారికి తేడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.  

2 Min read
Author : Navya G
Published : Dec 14 2021, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ (True love) ఉన్నప్పుడే శృంగార జీవితాన్ని మరింత ఆశీర్వదించగలరు. శృంగారం అనేది ఒక మధురమైన అనుభూతి. ఇది వారిలోని ప్రేమానురాగాలను పెంచే ప్రక్రియ. అయితే ప్రేమకు, శృంగారానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. భార్య భర్తల మధ్య సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు (Affections) బలంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎటువంటి సమస్యలు లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే శృంగారం పట్ల కూడా భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత అనేది ఉండాలి. స్త్రీ, పురుషుల మానసిక స్థితిని (Mood) మెరుగుపర్చడానికి శృంగారం కీలకపాత్ర వహిస్తుంది. మన ఆరోగ్యం బాగుండాలంటే సరైన వ్యాయామం ఎంత అవసరమో వివాహ జీవితంలో శృంగారం కూడా అవసరము. మానసిక ఒత్తిడిని (Mental stress) తగ్గించుకోవడానికి శృంగారం చక్కగా పనిచేస్తుంది. శృంగారం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. శృంగారంలో పాల్గొంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
 

35

నిత్యం శృంగారంలో పాల్గొంటే శరీరానికి వ్యాయామం అందించినట్లు అవుతుంది. శృంగారంలో పాల్గొంటే గుండె ఆరోగ్యంగా (Heart health) పనిచేస్తుంది. అయితే ఒక సంస్థ చేపట్టిన అధ్యయనంలో తరచూ శృంగారంలో పాల్గొనే వారి కంటే వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొనే వారిలో అధికంగా గుండె సమస్యలు ఉన్నట్లు తేలింది. శృంగారంలో ఎక్కువ సార్లు పాల్గొనే వారిలో రోగనిరోధక శక్తి (Immunity) కూడా అధికంగా ఉంటుంది.
 

45

వీరిలో నిద్రలేమి సమస్యలు (Insomnia problems) తక్కువట. అదే వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొనే వారిలో అధిక రక్తపోటు, నిద్రలేమి సమస్యలు అధికంగా ఉంటాయి. ఉదయం పూట శృంగారంలో పాల్గొంటే  ఆక్సిటోసిన్ అనే హార్మోన్ (Oxytocin hormone) విడుదల అవుతుంది. ఇది భాగస్వామిపై మరింత ప్రేమను పెంచుతుందట. ఎంత పని ఒత్తిడి ఉన్నా శృంగారానికి ఒక ప్రత్యేక సమయాన్ని ఏర్పరుచుకోవడం అవసరం.అయితే శృంగారలో ఎక్కువ సేపు పాల్గొనాలంటే తగిన ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా అవసరమే అని వైద్యులు చెబుతున్నారు.
 

55

చేపలు, సోయా, అరటి పండ్లు, బంగాళదుంపలు, గుమ్మడికాయ విత్తనాలు, మునగ కాయలు (Drumsticks) వంటి పదార్థాలు శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటితో పాటు గుడ్డు, పెరుగు, చిరుధాన్యాలు, వేరుశెనగలు, డ్రై ఫ్రూట్స్, బెల్లం (Jaggery) వంటి పదార్థాలను తీసుకునే ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే శృంగారంపై ఆసక్తిని పెంచుతాయి. తద్వారా శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనగలుగుతారని వైద్యులు తెలుపుతున్నారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved