రోజూ పెరుగును తినొచ్చా?
పెరుగు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. అందుకే దీన్ని పుష్కలంగా తినాలంటరు. పెరుగు మన జీర్ణక్రియను మెరుగుపడుతుంది. కడుపు అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అలాగే కడుపు, ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. పెరుగు ప్రోబయోటిక్ కావడంతో దీనిలో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది.

పెరుగును తినని వారు ఉండరు. పాల అలెర్జీ ఉన్నవారు తప్ప మిగతా అందరూ పెరుగును ఇష్టంగా తింటారు. పెరుగులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగులో కాల్షియం, విటమిన్ బి -2, పొటాషియం , మెగ్నీషియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పెరుగు ఒక గొప్ప ప్రోబయోటిక్. రోజూ పెరుగును మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, కడుపు అసౌకర్యం తగ్గుతుంది. పెరుగు కడుపు, ప్రేగుల ఆరోగ్యాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. ప్రోబయోటిక్ కావడంతో పెరుగులో మంచి బ్యాక్టీరియా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
yogurt
రోజూ పెరుగును తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే తుమ్ములు, జలుబు వంటి అలెర్జీ వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ పెరుగు తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచి జరుగుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.
పెరుగులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. క్యాల్షియం పుష్కలంగా ఉండే పెరుగు ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పెరుగు ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారం. కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరం ఎనర్జిటిక్ గా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
పెరుగు కూడా మన చర్మ ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు తినడానికి మాత్రమే కాదు, ముఖానికి కూడా అప్లై చేయొచ్చు. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. డార్క్ స్పాట్స్ ను నయంచేస్తుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ కాఫీ పొడిలో చిటికెడు పసుపు, ఒక టీస్పూన్ పెరుగును వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ ముఖంపై మొటిమలను తొలగించడానికి సహాయపడుతుంది.
అలాగే పెరుగుతో చేసిన హెయిర్ మాస్క్ లు చుండ్రును తగ్గించడానికి, జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడతాయి. ఇందుకోసం అరకప్పు పెరుగుతో పాటు ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె వేసి బాగా కలపాలి. తర్వాత దీన్ని జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనిని వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించొచ్చు.