సమ్మర్ స్పెషల్.. చింతచిగురును తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..?
చింతచిగురు (Tamarind leaves) వేసవిలో విరివిగా లభిస్తుంది. రుచికి పుల్లగా ఉండే చింతచిగురుతో చేసుకునే వంటలు చాలా రుచిగా ఉండటంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

చింతచిగురులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి మంచి ఎనర్జీ బూస్టర్ (Energy booster) గా సహాయపడి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చింతచిగురులో డైటరీ ఫైబర్ (Dietary fiber) పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా విరేచనం సాఫీగా జరిగేలా చేసి జీర్ణాశయ సమస్యలను తగ్గించడంతో పాటు మలబద్ధకం (Constipation) వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే ఫైల్స్ ఉన్నవారికి చింతచిగురు మంచి ఫలితాలను ఇస్తుంది.
కడుపులో నులిపురుగులతో (Worms) బాధపడే పిల్లలకు చింతచిగురుతో చేసిన ఆహార పదార్థాలను ఇస్తే మంచి. చింత చిగురు ఉదర భాగాన్ని ఆరోగ్యంగా (Abdominal Health) ఉంచి ఉదర సంబంధిత సమస్యలను కూడ తగ్గిస్తుంది. కనుక వేసవిలో అందుబాటులో ఉండే చింతచిగురును తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. చింతచిగురును తీసుకుంటే శరీరంలో ఎర్రరక్తకణాల (Erythrocytes) వృద్ధి జరుగుతుంది.
అంతే కాకుండా ఇది రక్తాన్ని శుద్ధి (Purify the blood) చేసి గుండె జబ్బులు (Heart disease) రాకుండా సహాయపడుతుంది. చింత చిగురులో ఉండే గుణాలు ఎముకలను బలోపేతం చేసి దృఢంగా మారుస్తాయి. కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడేవారు చింతచిగురు పేస్టును కీళ్ళపై కట్టులా కట్టుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
షుగర్ వ్యాధితో బాధపడే వారికి మంచి పరిష్కారంగా చింతచిగురు సహాయపడుతుంది. ఇది రక్తంలోని చక్కెర నిల్వలను (Sugar reserves) తగ్గించి షుగర్ వ్యాధిని (Diabetes) నియంత్రిస్తుంది. కనుక షుగర్ వ్యాధితో బాధ పడేవారు చింతచిగురును తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. చింతచిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
ఇవి రోగనిరోధక శక్తిని (Immunity) పెంచి అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పలు రకాల క్యాన్సర్లు (Cancers) రాకుండా అడ్డుకుంటాయి. ఇన్ఫెక్షన్ కారణంగా ఏర్పడిన గొంతు నొప్పి, మంట, వాపుల నుంచి ఉపశమనం కోసం ఉడికించిన చింతచిగురు నీటిని పుక్కిలిస్తే మంచిది.
అలాగే ఇది నోటి పగుళ్లు, పూతలను కూడా తగ్గిస్తుంది. చింతచిగురును తీసుకుంటే కంటి సమస్యలు (Eye problems) కూడా తగ్గుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు వణుకుతూ వచ్చే జ్వరాన్ని కూడా తగ్గిస్తాయి. అలాగే థైరాయిడ్ (Thyroid) సమస్యలతో బాధపడుతున్న వారు చింతచిగురుతో చేసిన ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.