మొలకెత్తిన గింజలను తింటే ఎంత ఆరోగ్యమో.. అలాంటి రోగాలు మాయం!
ప్రస్తుత కాలంలో సరైన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే పోషక విలువలు కలిగిన ఆహారం ఎంతో ముఖ్యం మరి ఎన్నో పోషకాలు ఉన్నటువంటి మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సరైన ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటారు. ఇలా అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. మరి మొలకెత్తిన గింజలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనే విషయానికి వస్తే...
మనం శరీర బరువు తగ్గాలన్న లేదా పెరగాలన్న క్యాలరీలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఇలాంటి క్యాలరీలతో సంబంధం లేకుండా తినగలిగే ఆహార పదార్థాలలో మొలకెత్తిన గింజలు ఒకటి. అందుకే ప్రతిరోజు మొలకెత్తిన గింజలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు చర్మ, జుట్టు సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.
ప్రతిరోజు కొన్ని రకాల దినుసులను ఓ గుప్పెడు నీళ్లలో రెండు మూడు గంటల ముందు నానబెట్టాలి అనంతరం ఆ నీటిని ఒంపి శుభ్రమైన గుడ్డలో కట్టి గాలి తగలకుండా పెట్టడం వల్ల ఆ గింజలన్నీ మొలకెత్తుతాయి. ఇలా గింజలన్నీ సుమారు రెండు నుంచి ఐదు సెంటీమీటర్లు మొలకలు వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా మొలకలు వచ్చిన వాటిలో విటమిన్ సి కె అధికంగా లభిస్తాయి.
ఇక మనం మొలక కట్టే గింజలలో పెసరపప్పు వండేలా చూసుకోవాలి పెసరలో ఫోలేట్ ఉండడం వల్ల ముఖ్యంగా ఈ పెసలు గర్భిణీ స్త్రీలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఫోలేట్ గర్భస్థ శిశువు పెరుగుదలకు దోహదపడుతుంది.అయితే ప్రతిరోజు ఉదయం వీటిని అల్పాహారంగా కొద్ది పరిమాణంలో తీసుకోవడం మంచిది అతిగా తీసుకోవడం వల్ల గ్యాస్టిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక విటమిన్ సి కారణంగా జుట్టు సమస్యలు తొలగిపోవడమే కాకుండా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో దోహదపడుతుంది. ఇలా రోగనిరోధక శక్తి పెరగటం వల్ల ఎలాంటి బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి. అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపించడంలో దోహదపడతాయి.ఇలా మొలికెత్తిన గింజలు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులో వారు తినవచ్చు అయితే పరిమితంగా తినడం ఆరోగ్యానికి మంచిది.