సబ్జా గింజలను ఈ విధంగా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
సబ్జా గింజలు (Sabza nuts) చూడడానికి నల్లని నువ్వుల్లా కనిపిస్తాయి. ఈ గింజలలో ఉండే పోషకాలు అనేక అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

కనుక ఈ గింజలను తీసుకుంటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) బోలెడు. మరి ఇంకెందుకు ఆలస్యం సబ్జా గింజలను ఏ విధంగా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సబ్జా గింజలలో విటమిన్ ఎ, ఇ లతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి తక్షణ శక్తిని అందించి రోజంతా హుషారుగా ఉండేందుకు సహాయపడుతాయి. అలాగే శరీర వ్యాధి నిరోధక శక్తిని (Immunity) పెంచి మంచి ఎనర్జీ బూస్టర్ (Energy booster) గా సహాయపడుతాయి.
అంతేకాకుండా ఒత్తిడి (Stress), ఆందోళన (Anxiety) వంటి సమస్యలను తగ్గించడానికి మంచి పరిష్కారంగా సబ్జా గింజలు సహాయపడతాయి. సబ్జా గింజలను నిమ్మరసం, పండ్ల రసాలు, ఫ్రూట్ సలాడ్స్, మిల్క్ షేక్స్, మజ్జిగలలో కలిపి తీసుకుంటే శరీర వేడి తగ్గి శరీరానికి చలువ చేస్తుంది. అలాగే అద్భుతమైన మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి సబ్జా గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే మంచిది.
ఇలా నానబెట్టిన సబ్జా గింజలను (Soaked sabza nuts) శారీరక శ్రమ చేసేవారు, క్రీడాకారులు ప్రతిరోజు తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఈ గింజలలో ఉండే అధిక మొత్తంలోని పీచుపదార్థం (Fiber) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్దకం సమస్యలను కూడా నివారించి ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. సబ్జా గింజలలో ఆల్ఫాలినోలిక్ యాసిడ్ ఉంటుంది.
ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును (Fat) కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు డైట్ లో సబ్జా గింజలను చేర్చుకోవడం మంచిది. వాతావరణంలో మార్పుల కారణంగా కలిగే శ్వాసకోశ సమస్యల (Respiratory problems) నివారణ కోసం సబ్జా గింజల పానీయంలో కొద్దిగా అల్లం రసం, తేనే కలిపి తీసుకోవాలి.
ఈ గింజలను నేరుగా తీసుకోరాదు. నీళ్లలో నానబెట్టిన తరువాతనే తీసుకోవాలి. తలనొప్పితో (Headache) బాధపడేవారు తక్షణ ఉపశమనం కోసం నానబెట్టిన సబ్జా గింజల నీళ్లను తీసుకోవడం మంచిది. ఈ గింజలలో ఉండే పోషకాలు రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని (Heart health) మెరుగుపరుస్తాయి.
ముఖ్యంగా వేసవి కాలంలో నీళ్లలో నానబెట్టిన సబ్జా గింజలను తీసుకుంటే అధిక ఎండ తీవ్రత కారణంగా శరీరానికి కలిగే వడదెబ్బ (Sunstroke) సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఈ గింజలలో ఫొలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు (Nutrients) మెండుగా ఉంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కనుక ఇన్ని పోషకాలను కలిగిన సబ్జా గింజలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు అంటున్నారు.