MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ముల్లంగిని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

ముల్లంగిని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

ముల్లంగి (Radish) సంవత్సరం పొడవునా దొరికే రూట్ వెజిటేబుల్ (Root Vegetable). ఇది ఎక్కువగా చలికాలంలో దొరుకుతుంది. ఈ ముల్లంగి శాస్త్రీయనామం రఫనస్ సటివస్. ముల్లంగితో సాంబార్ చట్నీ వంటి అనేక వంటలు తయారు చేసుకుంటూంటాం. ముల్లంగిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది శరీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. ఏదో ఒక రూపంలో ముల్లంగి నిత్యం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. 

2 Min read
Navya G | Asianet News
Published : Dec 14 2021, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19

ముల్లంగిలోని ఔషద గుణాల (Medicinal properties) గురించి సరైన అవగాహన లేక చాలామంది దీన్ని తినడానికి ఇష్టపడరు. ముల్లంగిని పచ్చిగా తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది. ముల్లంగిని ఎక్కువగా సలాడ్స్ లో  ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు ముల్లంగి శరీరానికి కలిగించే ఆరోగ్య ప్రయోజనాల (Health benefits) గురించి తెలుసుకుందాం.

29

కామెర్ల నుండి కాపాడుతుంది: ముల్లంగి లివర్, కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచి ఎర్రరక్త కణాలకు ఆక్సిజన్ ను అందిస్తుంది. ముల్లంగి ఆకులు (Radish leaves) కామెర్ల (Jaundice) నివారణకు సహాయపడతాయి.

39

మొలలు నివారణకు: శరీరంలోని విష పదార్థాలను (Toxic substances) బయటకు పంపేందుకు ముల్లంగి చక్కగా పనిచేస్తుంది. అలాగే జీర్ణక్రియ ప్రక్రియకు మెరుగుపరుస్తుంది. ముల్లంగి జ్యూస్ తాగితే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. దీంతో మొలల సమస్యకు (Piles problems) దూరంగా ఉండవచ్చు.

49

బరువును తగ్గిస్తుంది: ముల్లంగిలో పీచు పదార్థం, కార్బోహైడ్రేట్లు (Carbohydrates), నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర బరువును తగ్గించడానికి (Weight loss) చక్కగా పనిచేస్తాయి. ముల్లంగిని తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది శరీరానికి కావలసిన పోషకాలను అందించి ఆకలి సంతృప్తి పరుస్తుంది 

59

జ్వరాన్ని తగ్గిస్తుంది: ముల్లంగి రసంలో (Radish juice) కొద్దిగా బ్లాక్ సాల్ట్ (Black salt) ను వేసి కలుపుకొని తాగితే జ్వరం తగ్గుతుంది. ముల్లంగి రసం బాడీ టెంపరేచర్ ను కంట్రోల్లో ఉంచుతుంది. జ్వరం వచ్చినప్పుడు ముల్లంగి రసాన్ని తాగండి మంచి ఫలితం ఉంటుంది. 

69

శ్వాససంబంధిత సమస్యలను తగ్గిస్తుంది: ఇన్ఫెక్షన్ల (Infection) కారణంగా ఏర్పడే జలుబు, దగ్గు, అలర్జీ వంటి సమస్యలను తగ్గించడానికి ముల్లంగి చక్కగా పనిచేస్తుంది. శ్వాస నాళం (Trachea), ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

79

క్యాన్సర్ లను తగ్గిస్తుంది: ముల్లంగి క్యాన్సర్ (Cancer) ని సైతం తగ్గించగల సామర్థ్యం ఉంది. ముల్లంగిలో యాంటీ క్యాన్సర్ (Anti-cancer) ఔషధగుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి తగ్గించడానికి చక్కగా పనిచేస్తాయి.
 

89

మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది: శరీరంలోని వ్యర్థ పదార్థాలను (Waste materials) బయటకు పంపించడానికి ముల్లంగి చక్కగా పనిచేస్తుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు సైతం తగ్గించగల సామర్థ్యం ముల్లంగికి ఉంది. మహిళ పదార్థాలను బయటకు పంపించడానికి సహాయపడే కిడ్నీలు, యూరినరీ సిస్టమ్ (Urinary system) ఇన్ఫెక్షన్ బారిన పడకుండా సహాయపడుతుంది.
 

99

ముల్లంగి నోటి దుర్వాసనను తగ్గించడానికి, కడుపు నొప్పి (Abdominal pain), తలనొప్పి (Headache) సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ముల్లంగిని తప్పకుండా మన ఆహారపు అలవాట్లలో భాగంగా చేసుకోవాలి.

About the Author

NG
Navya G
 
Latest Videos
Recommended Stories
ఆవు పాలు vs గేదె పాలు.. ఆరోగ్యానికి ఏ పాలు మంచివి?
ఆవు పాలు vs గేదె పాలు.. ఆరోగ్యానికి ఏ పాలు మంచివి?
పనీర్ ను ఎక్కువగా తింటే ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త
పనీర్ ను ఎక్కువగా తింటే ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త
బెల్లం టీ తాగితే ఇలా అవుతుందా
బెల్లం టీ తాగితే ఇలా అవుతుందా
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved