ఉల్లిపాయలను తినడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా?
ఉల్లిపాయ (Onions) అందరి వంటింటిలో అందుబాటులో ఉండే కూరగాయ. ఉల్లిపాయలు అనేక ఔషధ గుణాలు (Medicinal properties) ఉన్నాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని పెద్దలు చెబుతుంటారు. ఉల్లిపాయ కోసినప్పుడు కంటి నుంచి నీరు వచ్చినా ఇది శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తుంది. నిత్యం ఉల్లిపాయను ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే ఉల్లిపాయ శరీరానికి మేలు చేసే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఉల్లిపాయలో క్యాల్షియం (Calcium), మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీబ్యాక్టీరియల్ (Antibacterial) లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి శరీరంలోని అనేక వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతాయి.
చాలామంది ఉల్లిపాయ తింటే నోటి దుర్వాసన (Bad breath) వస్తుందని తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఉల్లిపాయతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) తెలుసుకుంటే వాటిని తినడానికి ఇష్టపడతారు. అయితే ఉల్లిపాయ శరీరానికి కలుగజేసే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆర్థరైటిస్ నొప్పి: ఆర్థరైటిస్ నొప్పిలను (Arthritis pain) తగ్గించే ఔషధంగా ఉల్లి రసం పనిచేస్తుంది. ఉల్లిపాయలోని యాంటీఇన్ఫ్లమేటరీ (Antiinflammatory) లక్షణాలు నొప్పి నివారిణిగా సహాయపడుతుంది. ఉల్లిరసంలో కొన్ని నువ్వుల గింజలు వేసి వేడి చేయాలి. ఈ ఉల్లిరసం గోరువెచ్చగా ఉన్నప్పుడు నొప్పులు ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే ఆర్థరైటిస్ నొప్పిల నుంచి విముక్తి కలుగుతుంది.
కాలిన గాయాలను నయం చేస్తుంది: కాలిన గాయాలను (Burns) నయం చేయడానికి ఉల్లిరసం సహాయపడుతుంది. కాలిన ప్రదేశంలో ఉల్లి రసాన్ని రాసుకుంటే కాలిన గాయాలకు చల్లదనాన్ని అందించి బొబ్బలను నిరోధిస్తుంది. కాలిన గాయాలకు ఇన్ఫెక్షన్లు (Infection) రాకుండా ఉల్లిరసం అడ్డుకుంటుంది.
క్యాన్సర్ ను తగ్గిస్తుంది: ఉల్లిపాయ కేన్సర్ (Cancer) వ్యాధి నిరోధకంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) శరీరంలోని క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డగించే చురుకైన సమ్మేళనాలను కలిగి క్యాన్సర్ ను అడ్డుకుంటుంది.
లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది: ఉల్లిపాయ రసాన్ని (Onion juice) అల్లం రసాన్ని (Ginger juice) సమపాళ్లలో తీసుకుని కలిపి తాగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వెల్లుల్లి తర్వాత లైంగిక సామర్థ్యాన్ని పెంచే శక్తివంతమైన ఆహార పదార్థంగా ఉల్లిపాయ పనిచేస్తుంది.
దగ్గు నివారినిగా పనిచేస్తుంది: ఇన్ఫెక్షన్ ల కారణంగా ఏర్పడే దగ్గులను (Cough) తగ్గించడానికి ఉల్లిపాయ రసం చక్కగా సహాయపడుతుంది. ఇందుకోసం ఉల్లి రసాన్ని, తేనె రెండింటినీ సమపాళ్ళలో తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తాగడంతో దగ్గు, గొంతు నొప్పి (Sore throat) వంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
పైన చెప్పిన ఆరోగ్య సమస్యలతో పాటు కడుపు నొప్పి, ఆస్తమా (Asthma), గుండె సంబంధిత సమస్యలు, మూత్రకోశ వ్యాధులు (Bladder diseases), కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, జాండీస్, జీర్ణాశయ సమస్యలను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కనుక ఉల్లిపాయలను ఏదో ఒక రూపంలో నిత్యం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.